Central Government.. ఇకపై ఆరేళ్లు ఉంటేనే 1వ తరగతి అడ్మిషన్..!

Central Government: దేశంలోని విద్యార్థులకు.. వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది.. ఆరేళ్లు ఉంటేనే ఇకపై ఒకటవ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపోతే విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ పెట్టడం జరిగింది. విద్యార్థులు అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం కొత్త రూల్ తీసుకువచ్చిందని చెప్పాలి. విద్యార్థుల వయసు 6 సంవత్సరాలు ఉంటేనే ఇకపై ఒకటవ తరగతిలో చేర్చుకోవాలని స్పష్టం చేసింది.

Make PM Modi's 'Exam Warriors' Book Available in School Libraries': Education Ministry To States, UTs

అంతేకాదు ఈ ఆదేశాలను రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయాల్లో ఆరు ఏళ్ళు ఉన్న విద్యార్థులకే ఒకటవ తరగతిలో అడ్మిషన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.రాబోయే రోజుల్లో విద్యార్థుల సౌకర్యాల కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.