Marriage Gift :పెళ్ళిలో ఎన్నో వింతలు విడ్డురలు జరుగుతాయి.. పెళ్ళిలో పెళ్లి కొడుకు స్నేహితులు వధువు దగ్గరకు వచ్చి తామను అటపట్టిస్తూ ఉంటారు.. అయితే ఈ వధువు కూడా అలానే అనుకుంది.. కానీ ఏకంగా బాండ్ పేపర్ మీద సైన్ పెట్టమన్నాక అసలు విషయం అర్థమైంది..

హరిప్రసాద్ అనే వ్యక్తికి మదురైకి చెందిన పూజ తో వివాహం జరిగింది. హరిప్రసాద్ తేనీలోని ఓ ప్రైవేటు కాలేజీలో టీచర్‌గా పని చేస్తున్నాడు. ఇంకా సూపర్‌స్టార్ క్రికెట్ క్లబ్ కు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కాగా పెళ్లి తర్వాత తమ స్నేహితుడు క్రికెట్‌కు ఎక్కడ దూరమవుతాడో అని భావించిన తమ స్నేహితులు పెళ్లి వేదికపైనే పెళ్లి కూతురు పూజ కి ఓ షరతు విధించారు.
వీక్ ఎండ్స్ అంటే శని, ఆదివారాల్లో హరిప్రసాద్‌ను క్రికెట్ ఆడేందుకు అనుమతించాలని పూజను కోరారు. అయితే ఇది మాట తో సరిపెట్టలేదు. బాండు పేపరుపై రాసి ఇవ్వాలని భర్త స్నేహితులు కోరారు. వాళ్లు తనను ఆటపట్టిస్తున్నారేమో అని పూజ భావించింది. అయితే వాళ్ళు ఏకంగా రూ.20 బాండు పేపరు తీసుకొచ్చి సంతకం చేయమని కోరడంతో ఆవాకయ్యింది. వాళ్ళ స్నేహితుల పట్టుదలను చూసి పూజ సంతకం చేయక తప్పలేదు.
ఆ బాండ్ పేపర్ లో .. పూజ అను నేను.. నా భర్త, సూపర్ స్టార్ టీమ్ క్రికెట్ క్లబ్ జట్టు కెప్టెన్ హరిప్రసాద్ ను శని, ఆదివారాలు క్రికెట్ ఆడేందుకు అనుమతిస్తాను అని రాసున్నా బాండ్ పేపర్‌పై సంతకం చేసింది పూజ. ఈ సన్నివేశం పెళ్లి మండపంలో నవ్వులు పూయించగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.