Singer Sunitha : సాధారణంగా ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రతిభ ఉంటుంది.. ఆ ప్రతిభను గుర్తించినప్పుడే ఆ రంగంలో వారు దూసుకువెళ్తారు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే సంగీత నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన సింగర్ సునీత కూడా కెరియర్ మొదలు పెట్టడానికి బీజం పోసింది మాత్రం ఆమె కుటుంబ సభ్యులు అని చెప్పాలి. సాధారణంగా కూతురు ఎదుగుదలకు తల్లి తండ్రి ప్రోత్సాహం ఉంటుంది . కానీ సింగర్ సునీత విషయంలో మాత్రం అందుకు విరుద్ధమని చెప్పాలి.. ఒకవైపు తల్లి, తండ్రి ప్రోత్సాహం ఉన్నా.. మేనత్త , చిన్నమ్మల ప్రోత్సాహమే సునీతను నేడు ఈ స్థాయికి చేర్చాయని చెప్పాలి.వారి వల్లే సంగీత పాఠాలు నేర్చుకున్న సునీత ఆ తర్వాత కర్ణాటక సంగీతంలో కూడా ప్రావీణ్యం పొందింది..

సంగీతంలో ఆమెకు అన్ని మెలకువలు నేర్పించింది మాత్రం సునీత మేనత్త , చిన్నమ్మలు మాత్రమే అని చెప్పాలి. 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే సంగీతంలో మంచి ప్రావీణ్యం పొంది.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. 16 సంవత్సరాల వయసుకే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అలా గులాబీ సినిమాతో సింగర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన సునీత అందాన్ని చూసి రాంగోపాల్ వర్మ స్కూల్ సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే హీరోయిన్గా తాను నటించడానికి సిద్ధంగా లేదని ముఖం మీద సున్నితంగా తిరస్కరించింది
ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ కృష్ణారెడ్డి కూడా ఈమెకు హీరోయిన్గా అవకాశం ఇవ్వాలని అనుకున్నారు కారణం సౌందర్య తర్వాత అంతటి అందం.. అనుకువ ఉన్న అమ్మాయి కావడంతో కృష్ణారెడ్డి గారికి బాగా నచ్చేసింది సునీత. అలా ఈమెకు అవకాశాలు ఇవ్వాలని అనుకున్నారు. అయితే సునీతకు హీరోయిన్ అవ్వాలని ఆలోచన ఏమాత్రం లేదు . దీంతో ఆయనతో కూడా నటించను అని చెప్పేసింది ..అయితే ఆమెలో ఉన్న గొప్ప సింగర్ ను గుర్తించిన బాలసుబ్రమణ్యం మరెన్నో మెలుకువలను నేర్పించి.. ఆమెను అద్భుతమైన గాయనిగా మలిచారు. ప్రస్తుతం ఆమె సుమారుగా 3 వేలకు పైగా పాటలు పాడి ఎంతోమంది శ్రోతలను అలరించడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది.