BalaKrishna : తాజాగా నందమూరి బాలకృష్ణ.. తన బావ చంద్రబాబు నాయుడు, అల్లుడు నారా లోకేష్ పై ఊహించని విధంగా సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వివాదాలకు తెర లేపింది. ఇక వాళ్ళిద్దరూ కలసి తన సంసారంలో నిప్పులు పోస్తున్నారని, బాలకృష్ణ ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. మొదటిసారి బాలకృష్ణ బుల్లితెరపై హోస్ట్ గా మారిన కార్యక్రమం అన్ స్టాపబుల్. ఇక మొదటి సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండవ సీజన్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఈ రెండవ సీజన్ కి సంబంధించి తాజాగా తొలి ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. ఈనెల 14 అనగా శుక్రవారం నుంచి ప్రసారం కానుంది. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఈ షోకి సంబంధించిన తొలి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేయగా.. అందులో రెండవ సీజన్ కి మొదటి గెస్ట్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వచ్చారు.
ఇక బావబామ్మర్దుల మధ్య సంభాషణలు ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా మారాయి. ఇక సంభాషణలో భాగంగా బాలకృష్ణ తన ఫ్యామిలీ విషయాలను బయటపెట్టారు. ఇకపోతే బాలకృష్ణ చమత్కారి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తనకిప్పుడు రెండు ఫ్యామిలీలు ఉన్నాయని.. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45లో వసుంధర, పిల్లలు ఉన్నారని తెలిపారు. ఇంకా గతేడాది నుంచి మరో ఫ్యామిలీని కూడా మెయింటెన్ చేస్తున్నాను అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అంతేకాదు గత ఏడాది ఇంకో ఫ్యామిలీ మొదలు పెట్టానని ,చాలా డీప్ గా కనెక్ట్ అయిపోయాను అని ,తన బావ చంద్రబాబు నాయుడు ముందు ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. ఇక్కడ హాస్య భరితమైన విషయం ఏమిటంటే ఆయన రెండవ ఫ్యామిలీ అన్ స్టాపబుల్ టాక్ షో.. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆయన ఆహా షో తో ఎంత కనెక్ట్ అయ్యారో అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక చంద్రబాబు నాయుడు కూడా చమత్కారం పండించాడు.. బాలయ్య పై పంచ్ కూడా వేశారు. ఇది అతి పెద్ద బ్రేకింగ్ న్యూస్..
అర్జెంటుగా వసుంధర కి ఫోన్ చేసి చెప్పాలనడం.. హౌస్ లో నవ్వులు పూయించింది. ఇక మరోవైపు.. మీ లైఫ్ లో మీరు చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి? అని చంద్రబాబుని అడగగా.. మీకంటే ఎక్కువే చేశాను. అయితే మీరు సినిమాల్లో చేశారు.. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు చేశాను.. అమ్మాయిలు కనిపిస్తే సైలెన్సర్ తీసేసి, కీక్ అంటూ హారన్ చేసేవాళ్ళం అని చంద్రబాబు తెలిపారు. ఇక అంతటితో బాలయ్య ఆగకుండా.. మా చెల్లి భువనేశ్వరిని మీరు ఏమని పిలుస్తారు బావ అని అడగ్గా “భూ” అని పిలుస్తానని చెప్పడం , అంతటితో వదలకుండా అందరి సాక్షిగా మా చెల్లి కి ఐ లవ్ యు చెప్పాలని పట్టుబట్టాడు బాలయ్య.. ఇక చంద్రబాబు నాయుడు కూడా భువనేశ్వర్ కి ఫోన్ చేసి మీ అన్నయ్య చేతిలో ఇరుక్కుపోయాను అంటూ మాట్లాడడం మరింత నవ్వులు పూయించింది. అంతేకాదు నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. నారా లోకేష్ వచ్చినప్పుడు మీ నాన్న ఈ గెటప్ లో తప్ప మరే గెటప్ లో కనిపించరా? అని ప్రశ్నించగా యూరప్ కి ,మాల్దీవులకు వెళ్ళినప్పుడు కూడా ఇదే గెటప్ లో వస్తారు అని నవ్వులు పూయించారు . ఇక సందడిగా ఈ ప్రోమో చాలా వైరల్ గా మారుతుండగా ఎపిసోడ్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.