Ali: మెరిట్ స్టూడెంట్స్ కి అండగా అలీ..!

Ali.. బాగా చదువుకొని టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సమస్యల కారణంగా ఎంతో మంది తమ జీవితంలో ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే వారి కష్టాలను దగ్గరుండి చూసిన అలీ ఆస్ట్రేలియన్ అర్వేంసిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో చర్చలు జరిపి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు అలీ. గత ఏడాది ఒక కార్యక్రమం కోసం ఆస్ట్రేలియాకు అలీ గెస్ట్ గా వెళ్ళగా.. అక్కడ తెలుగు వారంతా కలిసికట్టుగా చేస్తున్న మంచి పనులను దగ్గరనుంచి చూసి ఇదే మంచి తెలుగు వారికి కూడా చేయొచ్చు కదా అని అర్వేంసిస్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో శశి కొలికొండను కోరారట అలీ.

Comedian Ali hurt, gives fitting reply to Pawan Kalyan
ఆలీ కోరికను మన్నించిన శశి కొలికొండ మరుసటిరోజే దాదాపు 60 మంది బృందంతో ఇండియాలో లాంచ్ అయ్యారు. తాజాగా ఒక మీడియాతో మాట్లాడిన వారు.. “మార్చి 3,4 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ సమ్మిట్ లో మేము కూడా పాల్గొనబోతున్నాము.. అలీ లాంటి మంచి వ్యక్తి మాకు, మా కంపెనీకి అండగా నిలబడడం ఆనందంగా ఉంది. ఇకపై మేము అలీతో కలిసి పేద మెరిట్ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాము. అలాగే వారికి ప్లేస్మెంట్ లో కూడా ఉద్యోగాన్ని కల్పిస్తాము” అంటూ తెలిపారు . ఈ విషయం తెలిసి అలీ అభిమానులే కాదు యావత్ రాష్ట్ర ప్రజలు , విద్యార్థులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.