Agnipath scheme: అగ్నిపథ్ పథకంపై కీలక తీర్పు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు..!

Agnipath scheme.. త్రివిధ దళాలలో స్వల్ప కాలిక నియామకం కోసం కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ల ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. అగ్నిపథ్ పథకం దేశ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిందని.. దీనివల్ల దేశ సాయుధ దళాలకు మేలు జరుగుతుందని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయబడింది. అగ్ని పథ్ పథకాన్ని రద్దు చేయాలని దాఖలైన పలు పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ,జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ తో కూడిన ధర్మాసనం విచారించింది..

వివాదంగా అగ్నిపథ్ పథకం...యువత తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటి?

రక్షణ దళాలలో నియామకాలకు పాత విధానాన్ని మాత్రమే కొనసాగించాలని పిటిషనర్ల అభ్యర్థులను తోసి పుచ్చుతూ పిటిషనర్లను కొట్టేసింది. అయితే ఇలా అడిగే హక్కు ఎవరికీ లేదు అని స్పష్టం చేసింది.. ఈ పథకానికి 17.5 నుండి 21 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు అని స్పష్టం చేసింది. నాలుగు సంవత్సరాల సర్వీస్ తర్వాత 25 శాతం మంది పర్మినెంట్ అవుతారు.. మిగిలిన 75% మంది బయటకు రావాల్సి ఉంటుంది.