Temple : గుడిలోనే తలనీలాలు ఎందుకు సమర్పించాలి.. పురాణాలు ఏం చెబుతున్నాయంటే..!!

Temple : మన హిందువులకు సాంప్రదాయమైన పనులు చాలా రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యంగా పుట్టిన బిడ్డకు తలనీలాలు ఇవ్వడం వెనక ఒక ఆచారం ఉండనే ఉంటుంది. ఎవరైనా సరే మన ఇంట్లో పిల్లలు జన్మించారు అంటే చాలు వారి యొక్క ఇష్టమైన పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడ దేవుళ్ళకు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక కొన్ని గుళ్ళల్లో అయితే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా తమ మొక్కులు తీర్చుకుంటారు. పుట్టెంటుకలు తీయడం కేవలం మన హిందూ సాంప్రదాయం లోనే ఉన్నది. అయితే దేవుడికి ఎందుకు తలనీలాలు ఇవ్వాలి… ఇలా ఇవ్వడము వల్ల ఫలితమేంటి అనే విషయాన్ని తెలుసుకుందాం.

తలనీలాలు ఇవ్వడం వలన చాలా కారణాలు ఉన్నట్టు గా పురాణాలలో తెలియజేయడం జరుగుతుంది. మానవ శిరోజాలు మనిషి అహంకారానికి, పాపాలకు నిలయాలని పురాణాలు తెలియజేస్తున్నాయి . వీటిని తీసి వేయడం ద్వారా పాపాలను తొలగించి పోతాయని అర్థమట. ఎవరి అందమైన శాశ్వతం కాదు.. అంటే ఈ విషయం దీని ద్వారా తెలుస్తుంది అని అందరూ అంటూ ఉంటారు. ముందుగా మనం జన్మించే టప్పుడు మన శరీరంలోని అన్ని భాగాలలో కంటే ముందు తల మాత్రమే బయటికి వస్తుంది. అందుచేతనే శిశువులకు చిన్న వయసులోనే తల వెంట్రుకలు తీస్తూ ఉంటారు. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల పూర్వజన్మ కు సంబంధించిన అనేక పాపాలు కూడా తొలగిపోతాయట.ఇక తలవెంట్రుకలను దేవుడికి సమర్పించడం ఎందుకంటే..

Why should heads be offered in the temple What do the myths say 
Why should heads be offered in the temple What do the myths say

మహాభారతంలో ఒక సంఘటన జరిగిన ఆధారంగా ఇలాంటి ఆచారం వచ్చింది. అదేమిటంటే జయద్రధుడు ని సంహరించేందుకు భీముడు సిద్ధమవుతూ ఉంటాడు. అలాంటి సమయంలోనే భీముడిని ధర్మరాజు అడ్డు వస్తాడు. ఇక అందుచేతనే తన ని చంపడం బదులుగా తల వెంట్రుకలను తీసి వేస్తే తల తీసేసి నంత పనవుతుందని ధర్మరాజు పూర్తిగా వివరిస్తాడు. అప్పుడు భీముడు ఆ యుద్ధంలో జయద్రధుడు ని ఓడించి గుండు గీస్తారు. ఎక్కడైనా తలవెంట్రుకలను సమర్పించే స్థలాన్ని కల్యాణకట్ట అని కూడా అంటూ ఉంటారు.అక్కడ తల వెంట్రుకలు తీస్తే వారికున్న పాపాలు కూడా తొలగించినట్లు అర్థమట.కాబట్టి ప్రతీ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి కాబట్టి ఈ ఆర్టికల్ ను ప్రతి ఒక్కరికి వాట్స్ అప్ ద్వారా షేర్ చేయండి.