UGADHI Festival : తెలుగు సంవత్సరాది లో తొలిరోజు ఉగాది. జనవరి 1ని అందరూ ఏడాదికి మొదటి రోజుగా చెప్పుకుంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది రోజు కొత్త ఏడాది ప్రారంభం అవుతుందని.. మన తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది ఇతర రాష్ట్రాల్లోనూ ఉగాది పెద్ద వేడుక.ఆ రోజు ఇష్ట దైవాన్ని పూజించుకొని ఉగాది పచ్చడిని ప్రసాదంగా నివేదిస్తారు. ఏమైనా ఇతర ఆహారాలు తింటారు. ఆరు రోజుల కలయికతో తయారు చేసే ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఎంతో.. ఈ పచ్చడిలో ఆరు రోజులు జీవితంలోని కష్టసుఖాలను సూచిస్తాయని చెబుతారు.
తీపి,కారం, పులుపు, ఉప్పు, వగరు,చేదు రుచుల కలయికతో ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. బెల్లం, పచ్చిమిర్చి, చింతపండు,ఉప్పు,మామిడికాయ,వేప పువ్వుని,ఆనవాయితీగా పచ్చడి తయారీలో ఉపయోగిస్తారు. కొంతమంది అదనంగా అరటిపండు, కొబ్బరి కోరు,పట్నాల పప్పులు,లాంటివి కూడా వేసుకుంటారు. అది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఉగాది పచ్చడి నోట్లో వేసుకోగానే తీపి తగిలితే ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. అదే చేదు తగిలితే కష్టాలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటారు. పులుపు తగిలితే కష్టసుఖాలు కలయికగా ఉంటుందని అంటారు. అంతేకాకుండా ఉగాది పచ్చడి తయారీలో ఒక ఆధ్యాత్మిక భావన కూడా ఉంది.ఉగాది పచ్చడి తినేటప్పుడు ఏ రుచి మీకు తగులుతుందో అంచనా వేయడం కష్టం. అలాగే జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా
కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చిన జీవితాన్ని ముందుకు నడిపించాలని భావన ఉగాది పచ్చడిలో దాగుంది.
ఉగాది పచ్చడి తయారీ విధానం:
మిరపకాయలను,బెల్లాన్ని,మామిడి కాయలను తురుముకోవాలి. వేప పూను నీళ్లలో కడిగే శుభ్రం చేసుకోవాలి.అలాగే చింతపండును కాస్త నీళ్లలో నానబెట్టాలి. చింతపండు పప్పిని తీసి పడేసి ఆ రసాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ చింతపండు నీళ్లలో ఉప్పు, మామిడి తురుము, బెల్లం తురుము, పచ్చిమిరపకాయల తురుము, వేప పువ్వు తురుము వేసి కలుపుకోవాలి. వేప పూను అధికంగా వేయకూడదు చేదు ఎక్కువ అవుతుంది. మీకు కావాలనుకుంటే కొబ్బరి ముక్కలు,అరటిపండు ముక్కలు,జామ మొక్కలు కూడా కలుపుకోవచ్చు.