jewelry: ఆడవారు అందంగా ఉంటారు అనడం లో సందేహం లేదు. అలాంటి ఆడవారికి ఆభరణాలు మరింత అందాన్ని తీసుకొచ్చి పెడతాయి. ఇదిలా ఉండగా ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే భారతీయ స్త్రీ ని సులభంగా గుర్తు పట్టవచ్చు. ఎందుకంటే ఆమె నిండుగా చేతికి గాజులు, కాళ్ళకు పట్టీలు , ముక్కుపుడక , మెడలో హారం , నడుము కు వడ్డాణం.. నుదుటి మీద బొట్టు ఇలా అన్నింటిని ధరించి అమ్మవారి వలె దర్శనం ఇస్తూ ఉంటుంది. అందుకే మిగతా దేశాలలో పోలిస్తే భారతదేశంలో ఆడవారికి ప్రత్యేకమైన గుర్తింపు , గౌరవం కూడా ఉంది. ముఖ్యంగా ఆడవారు ధరించే పట్టీలు, గాజులు వెనుక కొన్ని రహస్యాలు కూడా దాగి ఉన్నాయి.
ఇలా ధరించడం వల్ల కేవలం సాంప్రదాయానికి మాత్రమే సంబంధించిన వస్తువులు .. ఆచారాలు మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. కానీ గాజులు, పట్టీలు పెట్టుకోవడం వెనుక ఒక కథ కూడా ఉంది. పూర్వ కాలంలో చాలామంది మగవారు బయట నుంచి పని ఎక్కువగా చేసే మగవారికి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరిగింది. కానీ ఆడవారు ఇంట్లో ఉంటూ వంట గదికి పరిమితం కావడం వల్ల వారిలో రక్త ప్రసరణ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. ఇక అప్పటినుంచి ఆక్యుప్రెషర్ టెక్నిక్ మొదలుపెట్టారు. అంటే కొన్ని చోట్ల శరీరంలో ఒత్తిడి పెంచడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అని ఈ టెక్నిక్ చెబుతుంది.
అయితే సైన్స్ కూడా ఏం చెబుతోంది అనే విషయానికి వస్తే.. భారతదేశంలోనే కాదు చైనాలో కూడా ఈ టెక్నిక్ బాగా పాపులారిటీని అందుకుంది. అయితే చైనా వారు గాజులు, పట్టీలు వేసుకోవడం లాంటి చేతులతోనే కొన్ని ప్రదేశాలలో ఒత్తిడి తీసుకు వస్తూ ఉంటారు. కానీ మన భారతీయులు మాత్రం అంత కష్టం ఎందుకు అని అలంకరణగా ఉంటుంది అలాగే ఆరోగ్యంగా ఉండవచ్చు అన్న ఆలోచనతోనే గాజులు అలాగే పట్టీలు కూడా తొడగడం మొదలు పెట్టారు. ఇక ఇవే ఆడవారి జీవితంలో అలంకరణాలు గా మారిపోయాయి.
ఇక చేతులకు గాజులు , కాలికి పట్టీలు వేసుకోవడం వల్ల కొన్ని నరాలను ఎప్పుడూ తాగుతూ ఉండడం వల్ల ఆక్యు ప్రెషర్ టెక్నిక్ ద్వారా బ్లడ్ సర్కులేషన్ సరైన ట్రాక్ లో ఉంటుంది అని సమాచారం. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహిళలు గాజులు, పట్టీలు వేసుకొని ఇంట్లో తిరగడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని మహిళలు సంతోషంగా ఉండడం తోపాటు ఇల్లు కూడా సంతోషంగా ఉంటుందని పెద్దవాళ్ళు అభిప్రాయపడ్డారు. ఎముకలు గట్టిపడతాయి . ఇక నడుముకు వడ్డాణం ధరించడంవల్ల గర్భ సమస్యలు, నెలసరి సమస్యలు తలెత్తవు. వివాహిత స్త్రీ కాలి వేళ్ళకు మెట్టెలు పెట్టుకోవడం వల్ల మూడ్ స్వింగ్ సమస్యలు అదుపులో ఉంటాయి అని చెబుతున్నారు.