హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వచ్చే శ్రావణమాసానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అందుకే ఏ పని చేపట్టాలన్నా.. శ్రావణమాసంలోనే ఎక్కువగా ప్రారంభిస్తూ ఉంటారు ముఖ్యంగా శుభకార్యాలను మొదలుకొని.. శ్రీమంతం, పుష్పవతి, గృహప్రవేశం ఇలా ప్రతి శుభకార్యాలను ఎక్కువగా శ్రావణమాసంలోనే చేయడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మరి ఈ క్రమంలోనే శ్రావణమాసంలో కొన్ని రకాల మొక్కలు నాటాలి అని ప్రకారం చెప్పబడింది. మరి ఆ మొక్కలు ఏమిటో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..
సంపంగి మొక్క : ఈ మొక్క చాలా శుభప్రదంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈ మొక్కను నాటడం వల్ల మన అదృష్టం ప్రకాశిస్తుంది. ముఖ్యంగా సంపంగి మొక్కలు ఇంటి చుట్టూ చిన్న కుండీలలో కూడా నాటవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఏర్పడడమే కాదు లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు అవుతుంది. అందుకే శ్రావణమాసంలో సంపంగి మొక్కలను నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు.
జమ్మి మొక్క : శ్రావణ మాసంలో శివుడికి జమ్మి ఆకులను నైవేద్యంగా పెట్టడం వల్ల మేలు జరుగుతుంది. ముఖ్యంగా శని దేవుడు శివుడితో సంబంధం కలిగి ఉంటాడని, ఆయన శివ భక్తుడని చెబుతారు. అందుకే శ్రావణమాసంలో మీ ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల శని దేవుడి కృప కూడా కలుగుతుంది. ఆర్థిక నష్టాలు ఉండవు..అదృష్టం కలిసి వస్తుంది.
ఉమ్మెత్త మొక్క : శివుడికి అత్యంత ప్రీతికరమైన మొక్క అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి, భక్తులు కష్టాలను తొలగించుకోవడానికి ఎక్కువగా శివుడికి ఉమ్మెత్త మొక్కల పువ్వులను సమర్పిస్తారు. అందుకే ఈ మొక్కలను మీ ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల శ్రావణమాసంలో మీ ఇంటికి లక్ష్మీదేవి కూడా వస్తుంది అని వాస్తు శాస్త్రం చెబుతోంది.
జిల్లేడు మొక్క : ఈ మొక్కలు నాటడం వల్ల పరమశివుడి ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుంది. ఈ మొక్క సానుకూల శక్తిని ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక మన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ మొక్కను ఎక్కువగా ఇంటి చుట్టుపక్కల నాటుకుంటే ఇంటికి శుభం కలగడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు. శ్రావణమాసంలో ఈ మొక్కలు నాటడం వల్ల అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది.