Vastu Tips : మన భారతీయసంప్రదాయంలో వాస్తుశాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఉంది. ఇల్లు కట్టేటప్పుడు వాస్తు ప్రకారం ఏ గది ఎటు ఉండాలో నిర్దేశించినట్లే, అలాగే ముఖ్యమైన వస్తువులు ఏవి ఎక్కడ ఉంచాలో వాస్తునిపుణులు సూచిస్తారు.ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో అసలు బరువు ఉండకూడదని చెప్పినట్లే, కొన్ని చోట్ల బరువు ఉంటే మంచిదని కూడా వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తారు.బీరువాను ఉత్తర దక్షిణ దిశల మధ్యలో ఉంచితే…వాయువ్యం చంద్రునిది. చంద్రుడు ధన ప్రవాహానికి అధిపతి. కనుక వాస్తు సూచనలను అనుసరించి, డబ్బు నగలు భద్రపరచుకునే బీరువా ఉత్తర వాయువ్యంలో, దక్షిణ ముఖం చేసి ఉంటే శ్రేష్టం. బీరువాలో ధనం లేదా నగలు భద్రపరిచేటప్పుడు ఉత్తర ముఖ చేస్తాం అన్నమాట. ఈ సూచన పాటిస్తే డబ్బు ఎక్కువగా ఖర్చు అవదు. ఇంట్లోకి సంపాదన ప్రవాహాం లా ఏ ఆటంకం కలగకుండా ధనం ప్రవహిస్తుంటుంది.బీరువాను ఉత్తర దిక్కు మధ్యలో ఉంచితే…
ఉత్తర దిక్కుకు అధిపతి బుధుడు. బుధుడు సంపదలకు అధిపతి కనుక బీరువాను ఉత్తర దిక్కు మధ్యభాగంలో కూడా ఉంచితే మంచిది.కలియుగానికి ఆధిపతి అయినా వెంకటేశ్వరుడు దేవస్థానం అయినా తిరుమల తిరుపతి లో నిత్యం ముడుపులు రూపేనా కుప్పలుతెప్పలుగా డబ్బులు, బంగారం, వెండి వస్తువులు వచ్చిపడుతుంటాయి. ఆ వెంకన్న హుండీ దేవాలయంలో ఉత్తర దిక్కు మధ్యభాగంలో ఉంది. మనకు కూడా ఆదాయం బాగా కలసిరావాలంటే మన ఇంట్లో ఉత్తరదిక్కు మధ్యభాగంలో ధనము, నగలు దాచుకునే బీరువా ఉండాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తారు. బీరువా ఉత్తర దిక్కున ఉంటే అదృష్ట లక్ష్మి కలిసివస్తుంది.బీరువా తూర్పు దిక్కున ఉంటే…
బీరువా కనుక తూర్పువైపున ఉంటే మండే సూర్యుడల్లే కష్టం వచ్చిన ప్రతివాడికి కష్టం కనిపించి లేనిపోని ఖర్చులు వచ్చిపడతాయి.కానీ నీకు కష్టం వస్తే చేయూతనిచ్చే బంధువులు కానీ, మిత్రులుకాని ముందుకు రారు.ఈశాన్యంలో బీర్వా ఉంటే..బీరువా తూర్పు – ఉత్తరం కు మధ్యలో పెడితే ప్రతి చిన్న విషయానికి కూడా అధిక ధనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బూడిదలో పోసిన పన్నీరులా డబ్బు వృథాగా ఖర్చయిపోతుంది.ఆగ్నేయంలో బీరువా ఉంటే…ఆగ్నేయంలో కనుక బీరువా పెడితే ఆగ్నేయ మూల ఆధిపతి అగ్ని.. వచ్చిన సొమ్ము అంతా దొంగలు దోచుకుపోయే అవకాశం ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూ వుంటారు.నైరుతిలో బీరువా ఉంటే…బీరువాను నైరుతిలో ఉంచితే ఎంత కష్టపడి సంపాదించినా అది మనకు ఉపయోగపడకుండా ఎలా వస్తుందో అలానే వెళ్ళిపోతుంది. మన చేతుల కష్టంకూడా మనకు ఉపయోగపడకుండా ఇతరుల పాలవుతుంది.