Vastu Tips : పూజ గది ,కిచెన్, బాత్రూమ్ లో ఈ తప్పులు చేస్తూ ఉంటే మాత్రం మిమ్మల్ని ఎవరు కాపాడలేరు..!!

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాదు ఇంట్లో ఉంచే వస్తువులపై కూడా దృష్టి పెట్టాలి. ఇక ఇంటిలో అలంకరణ కోసం పెట్టే వస్తువులు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే ఉండాలి. లేకపోతే మరెన్నో అనారోగ్య సమస్యలు , ఆర్థిక సమస్యలు, కుటుంబంలో కలహాలు, గొడవలు ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కిచెన్, బాత్రూం పూజ గది విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలట. ఎక్కడ ఉంచాల్సిన వస్తువులను అక్కడే ఉంచాలి అని , ఇంటికి వేసే రంగుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇక చాలా మంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం, బెడ్ రూమ్ , లివింగ్ రూమ్ వరకు మాత్రమే చూసుకుంటూ ఉంటారు.

కానీ కిచెన్ , బాత్రూం, పూజ గది విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలట. బాత్రూం కోసం ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలంటే.. బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచకూడదు.. ఇలా బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచడం వల్ల కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతేకాదు నీలి రంగు బకెట్లో నీటిని నింపి బాత్రూం లో ఉంచడం వల్ల ఆ ఇంట్లో శ్రేయస్సు లభిస్తుంది. వాస్తులో నీలం రంగు చాలా ముఖ్యమైనది. ఇది సంతోషానికి, శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. కాబట్టి బాత్రూంలో బ్లూ టైల్స్ కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మీ సంపద పెరగడానికి సహాయపడుతుంది.వంట గది కోసం ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలంటే.. వాస్తు శాస్త్రం ప్రకారం నారింజ , పసుపు, ఆకుపచ్చ వంటి రంగులు వంటగదికి బాగా పనిచేస్తాయి.

Vastu Tips on These mistakes in pooja room kitchen bathroom
Vastu Tips on These mistakes in pooja room kitchen bathroom

ఇక బూడిద, గోధుమ , నలుపు రంగులను నివారించండి. కారణం ఇవి సానుకూల నాశనం చేస్తాయి. అంతేకాదు అగ్నిప్రభువు, అగ్ని.. ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ఆదర్శస్థానం మీ ఇంటికి ఆగ్నేయ దిశ అందుకే ఆగ్నేయ దిశలో మాత్రమే మీరు స్టవ్ ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు నిప్పు, నీరు వ్యతిరేక మూలాలు కాబట్టి గ్యాస్ సిలిండర్ , ఓవెన్ తో కూడిన వాష్ బేసిన్లు వంట గదిలో ఎప్పుడు ఒకే ప్లాట్ఫారం పైన ఉంచకూడదు. ఇక పూజగది వాస్తు చిట్కాలు విషయానికి వస్తే.. ఈశాన్య దిశలో పూజ గది ఉండాలి. చనిపోయిన వ్యక్తుల చిత్రాలను పూజ గదిలో పెట్టకూడదు. విగ్రహాలను కూడా ఎప్పుడు నేలపై ఉంచరాదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే నష్టాలను దూరం చేసుకోవచ్చు