Vastu Tips : వాస్తుకి సంబంధించిన చిన్న విషయాలు పెద్ద మార్పులను తీసుకొస్తాయి. వాస్తు నిపుణులు. చెప్పిన దాని ప్రకారం ఈ చిన్న చిట్కాలను పాటించండి. వాస్తు అనేది రెండక్షరాల పదమే కాదు. అమ్మో… అడుగు వేసినా తీసినా సెంటిమెంట్స్ మాత్రం లెక్కలేనన్ని ఉంటాయి. వాస్తుని పట్టించుకునేవారికి. బెడ్ రూమ్ నుండి బాత్ రూం వరకూ… కిచెన్ నుండి దేవుడి మందిరం వరకూ అన్ని గదుల్లోను ఉండాల్సినవి, ఉండకూడనవి కొన్ని సూచనలను వాస్తు నిపుణులు సూచించారు. ఎందువలన అంటే ఇంటి ఎంట్రన్స్ నుంచి లోపల అణువణునా ముఖ్యమే. లివింగ్ రూమ్, బెడ్ రూం అందంగా మీకు నచ్చినట్టుగా సర్దుకుంటే సరిపోదు. కిచెన్, బాత్రూమ్ కి సంబంధించిన కొన్ని సూచనలున్నాయి.ఇపుడు చెప్పినవన్నీ చిన్న మార్పులే కావచ్చు కానీ చాలా మంచి ఫలితాలను చూస్తారు.
* వాస్తు ప్రకారం పసుపు, ఆకుపచ్చ, నారింజ, రంగులు వంటగదికి వేసుకోవడం మంచిదని చెప్పవచ్చు.
* వంటగదిని ఎప్పుడూ ఇంటికి అగ్నిస్థానం. అయిన ఆగ్నేయంలోనే ఉండాలి.* నీరు-నిప్పు వ్యతిరేక మూలకాలు కాబట్టి…. గ్యాస్ – వాష్ బేసిన్లలు వంట గదిలో ఒకే ప్లాట్‌ఫారమ్‌పై ఒకదాని ఒకటి సమాంతరంగా ఉంచరాదు.* పూజగదిని ఎప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.* పూజా స్థలం పడకగదిలో ఉంచరాదు. తప్పనిసరి పరిస్థితుల్లో అస్సలు బెడ్రూమ్‌లో దేవుడి మందిరాన్ని ఉంచాల్సి వస్తే అటువైపు కాళ్లు పెట్టకుండా నిద్రించాలి.* దేవుడి విగ్రహాలను ఎల్లప్పుడూ నేలపై కూడదు. ఇంట్లో పెంటుకునే విగ్రహాలు 10. అంగుళాల కంటే పెద్దగా ఉంచకూడదు.
బాత్రూం కోసం వాస్తు చిట్కాలు : * బాత్రూం మీ ఇంటికి ఉత్తరం వైపు లేదా వాయువ్య భాగంలో ఉండాలి. బాత్రూం ని నైరుతి దిశలో నిర్మించినట్లయితే ఆ ఇంట్లో ఉంటున్న వారికి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
* గీజర్స్ వంటి వాటిని ఎలక్ట్రికల్ ఫిట్టింగులను ఆగ్నేయం వైపు మాత్రమే ఉంచవచ్చు.
* బాత్రూమ్ లో అద్దాలు తూర్పు లేదా ఉత్తరం గోడపై ఉంచాలి. * బాత్రూమ్స్ లో నీలరంగు బకెట్లు ఉంచటం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అవకాశం ఉన్నట్టయితే బాత్రూం టైల్స్ నీలిరంగు వినియోగించడమే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణుల తెలుపుతున్నారు.