Vastu Tips : భారతీయ హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంటింట్లో బెల్లం తప్పనిసరిగా ఉంటుంది. పూర్వకాలంలో అయితే ఎక్కువగా కాఫీ, టీ, తీపి పదార్థాలు ఏవైనా కూడా బెల్లం తోనే తయారు చేసుకునేవారు. కానీ పరిస్థితులు మారుతున్న కొద్ది చాలామంది చక్కెరను ఎక్కువగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. మనం తయారు చేసే ఎటువంటి తీపి పదార్థాలలో అయినా సరే చక్కరకు బదులుగా బెల్లం వాడడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యానికే కాదు వాస్తు ప్రకారం కూడా బెల్లంకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బెల్లం ఇంట్లో ఉండడం వల్ల వ్యక్తి యొక్క పురోగతి అభివృద్ధి చెందుతుంది.
వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగం, వివిధ మార్గాలలో డబ్బు రావడం వంటి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బెల్లం నుండి ఏ పరిహారం ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఎవరైనా సరే ఆర్థిక పరిస్థితితో ఇబ్బంది పడుతున్నట్లయితే చిన్న బెల్లం ముక్క.. నగదు కొరతను కూడా తొలగించ కలదు. ఇందుకోసం మీరు ఒక చిన్న బెల్లం ముక్కను ఎర్రటి గుడ్డలో నాణెం తో సహా కట్టాలి. ఆ తర్వాత లక్ష్మి చిత్రం ముందు దీనిని ఉంచి ప్రతిరోజు పూజ చేసి.. ఐదవ రోజు దుర్గాదేవిని పూజించిన తర్వాత ఈ వస్త్రాన్ని తీసుకొని అల్మారా లో భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితులు దూరం అవుతాయి. సూర్యుడిని బలోపేతం చేయడానికి బెల్లం ఉపయోగిస్తారు.
జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉంటే ప్రతిరోజు బెల్లం కలిపిన నీటిని తాగడం వల్ల మీకు ఆరోగ్య ప్రాప్తి తో పాటు ఆర్థిక సమస్య కూడా దూరం అవుతుంది. దీనితోపాటు ఆదివారం నుండి వచ్చే 8 రోజులపాటు ఆలయానికి 800 గ్రాముల గోధుమలు, 800 గ్రాముల బెల్లం సమర్పించండి. దీనివల్ల మీకు మీ కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది. సంపద పెరగాలంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం, ఆనందం, శ్రేయస్సు, ధాన్యం కావాలనుకుంటే గురువారం రోజు ఆవుకు శెనగపిండితో కలిపిన బెల్లం తినిపించాలి. ఇలా చేస్తే ధన సమస్యలు తీరుతాయి. వివాహానికి ఆటంకం ఏర్పడినప్పుడు.. ప్రతి గురువారం గోధుమపిండిలో కాస్త బెల్లం, నెయ్యి, పసుపు వేసి ఆవుకు తినిపించాలి. ఇలా ఏడు గురువారాలు చేస్తే తొందరగా వివాహం అవుతుంది.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.