Vastu Tips : వాస్తు ప్రకారం ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే ఇంట్లో ఏ జంతువులను పెంచాలో తెలుసా?

Vastu Tips : సాధారణంగా ఈ మధ్యకాలంలో చాలామంది పెంపుడు జంతువులను తమ ఇంటి సభ్యులలో ఒక భాగం చేసుకుంటున్నారు. అయితే హిందూ పురాణాల ప్రకారం కూడా పెంపుడు జంతువులు అదృష్టానికి, శ్రేయస్సుకు, సంపదకు చిహ్నాలుగా పరిగణిస్తారు. నిజానికి పెంపుడు జంతువులు ఇంటి సానుకూలతను పెంచుతాయని హిందూ పురాణాల ప్రకారం వెల్లడయ్యింది. అయితే మరి కొంతమంది ఇళ్లల్లో పెంపుడు జంతువులను పెంచుకోవడానికి ఇష్టపడరు. కానీ మరి కొంతమంది పిల్లులు , కుక్కలు, చేపలు, తాబేలు, పక్షులు ఇలా రకరకాల జంతువులను, పక్షుల ను పెంచుకుంటూ ఉంటారు.

ఎక్కువగా జంతువులను పెంచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఏ జంతువులను ఇంట్లో పెంచుకుంటే మనకు మంచి జరుగుతుంది. ఇంట్లో సిరిసంపదలు తులతూగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఈ జంతువులనేవి పర్యావరణం నుండి ప్రతికూల శక్తిని తొలగించడంలో సహాయపడతాయి . అలాగే వాస్తు దోషాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. భవిష్యత్తులో మనకు సంభవించే సమస్యలను దారి మళ్లిస్తాయి.నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో చెట్లు మొక్కలతో పాటు సానుకూలతను పెంచే జంతువులను కూడా పెంచుకోవాలని చెబుతున్నాయి.

Vastu Tips If you want to get more money then you protect these animals
Vastu Tips If you want to get more money then you protect these animals

అదృష్టానికి చిహ్నంగా పరిగణించే పెంపుడు జంతువులు ఏమిటంటే ఆవులు, కుక్కలు ,కుందేలు, గేదెలు , గుర్రాలు , చిలుకలు, చేపలు ఉత్తమ పెంపుడు జంతువులుగా పరిగణిస్తారు ఎందుకంటే ఇది విధిని సూచిస్తాయి. కుందేళ్ళను పెంచుకోవడం వల్ల థైరాయిడ్ సమస్యల నుండి కుటుంబ సభ్యులకు విముక్తి కలుగుతుంది. అదే ఆవులను పెంచుకున్నట్లయితే పాలను అందించడమే కాదు మీ ఇంటి నుండి ఏదైనా ప్రతికూలత శక్తిని కూడా తొలగిస్తాయి. అంతేకాదు కుటుంబం బంధాన్ని మెరుగుపరుస్తాయి. కుక్కలు పెంచుకోవడం వల్ల కుటుంబాని పిల్లలకు చాలా మంచిది. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అలాగే చేపలు నీటిలో కదలడం వారు ఇంటి సానుకూల శక్తిని పెంపొందిస్తాయి. చేపలు మనిషి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి గుర్రాలు బలం ,ప్రతిష్టకు చిహ్నాలు. ఇంట్లో ఈ జంతువులను పెంచుకున్నారంటే మీ ఇంట్లో అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా తులతూగుతుంది.