Vastu Tips : ఇంట్లో సుఖ సంతోషాలు కలగాలంటే ఉప్పుతో ఇలా చేస్తే చాలు..!

Vastu Tips : ప్రతి ఒక మనిషి ఉప్పు వేసిన ఆహారం తినడమే అలవాటు. ఉప్పులేని ఆహారమును అంతగా ఇష్టపడరు. ఉప్పు తగిన విధంగా తీసుకోకపోతే ఆరోగ్యం సమస్యలను కొని తెచ్చుకున్నవారమవుతాము. ఉప్పు కేవలం ఆహార రుచిని అధికము చేయడమే కాకుండా.. ఇంట్లో ఉండే నెగటివ్ శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతుందని మీకు తెలుసా..? ఇంట్లో ఉండే ప్రతి సమస్యకు సమాధానాలను వాస్తు శాస్త్రం ద్వారా మన పూర్వికులు మనకు వివరించారు.ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ద్వారా పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. ఇది ఇంట్లో సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను పెంచడంలో కూడా సహాయపడుతుంది. పూర్వం పెద్దలు ఉప్పును పెద్ద జాడీలలో నిల్వ ఉంచుకొనేవారు. దీనికి కారణం వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పును లోహపు పాత్రల్లో నిల్వవుంచుకోకూడదు.

ఉప్పును గాజు సీసాలోకాని, పింగాని పాత్రల్లో నిల్వ ఉంచుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, వాస్తుప్రకారం కూడా మంచి జరుగుతుంది. ఇంట్లో ఆర్థిక అసమానతలు ఎక్కువగా వుంటే ఉప్పుతో ఇలా చేసి చూడండి. ఒక గాజు పాత్రలో ఉప్పువేసి బాత్రూంలో కనుక ఉంచితే ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ పెరిగి ధనాన్ని ఇంట్లోకి ఆగమించేలా చేస్తుంది. కావాలిసిన సొమ్ము సరైనా సమయానికి అందక ఇబ్బందులు ఎదురుకుంటూ ఉంటే , ఉప్పుతో ఇలా చేయాలి.ఇందుకోసం మొదటగా ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల ఉప్పు, నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి. ఇలా చేయడం సరైనా సమయానికి సొమ్ము అందుతుంది.

vastu Tips If you want happiness at home, just do this with salt
vastu Tips If you want happiness at home, just do this with salt

ఇంట్లో చికాకులు మరియి ఒత్తిడికి ఎక్కువగా గురువతూ ఉంటే వాస్తు శాస్త్రం ప్రకారం, ఆ వ్యక్తి ఉదయం స్నానం చేసేటప్పుడు స్నానపు నీటిలో చిటికెడు ఉప్పు వేసి స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా, పాజిటివ్ శక్తి కలిగి ఆ వ్యక్తికి ఒత్తిడి తొలగిపోతుంది. ఒక కుటుంబంలోని భార్యభర్తల మధ్యకాని, అన్నదమ్ముల మధ్య కానీ రోజూ ఏదో ఒక విషయంలో గొడవలు ఉంటే, చిటికెడు నల్ల ఉప్పును ఇంటిని తుడుచే నీటిలో కలిపి ఇంటిని తుడవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రతిరోజూ మంగళవారం ఇలా చేయడం చాలా మంచిది. కుటుంబ సభ్యులలో ఎవరైనా ఎక్కువ గా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అలాంటి వారి మంచం దగ్గర గాజు గిన్నెలో ఉప్పు ఉంచితే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది..ఆ వ్యక్తి పూర్తీ ఆరోగ్యంగా మారే వరకూ ఇలా చెయ్యడం మంచిది.ఈ ఉప్పును నెలకొకసారి మార్చుకుంటూ ఉండాలి.