Vastu Tips : వాస్తు ప్రకారం.. మరచిపోయి ఇలా చేశారు అంటే దరిద్రం మీవెంటే..!!

Vastu Tips : సాధారణంగా హిందూ సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో చాలా మంది వాస్తు లేనిదే ఏ పని చేయడం లేదు. ఇక మరికొంతమంది అసలు వాస్తునే పట్టించుకోవడం లేదు. కానీ వాస్తు దోషం ఉన్నట్లయితే ..ఎంత డబ్బు సంపాదించినా సరే చేతిలో డబ్బు నిలవక అనవసరంగా డబ్బు మొత్తం ఖర్చవుతుంది. అలాంటప్పుడు ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నాయో? లేదో? మనం ఏదైనా తప్పులు చేస్తున్నామో? అనే విషయాన్ని గుర్తించాలి. ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఇలాంటి దోషాలు కలుపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మరచిపోయి కూడా మీరు ఇలాంటి తప్పులు చేస్తున్నారేమో ఒకసారి పరిశీలించుకోవాలి. లేదంటే ఆర్థిక నష్టం, ఆస్తి నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇక ఆ తప్పులు ఏమిటో? ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చాలామంది ప్రధాన ద్వారాన్ని ఇతర ద్వారాలతో కలిపి ఒకే సైజులో చేయిస్తూ ఉంటారు. ఇలా ఎప్పటికీ చేయించకూడదు. ముఖ్యంగా సింహద్వారం అంటే పెద్దది కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఇంట్లోనే ఇతర ద్వారాలు కంటే పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక ఇతర ద్వారాలతో పోల్చుకుంటే పొడవు , వెడల్పులో సింహద్వారం పెద్దదిగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే వాస్తు ప్రకారం మీ ఇంటికి సెట్ అవుతుంది. లేదంటే వాస్తు దోషం ఏర్పడి ఇంట్లో ధన నష్టం , ఆస్తి నష్టం , కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఇక సింహద్వారం పెద్దగా ఉండాలి మిగతా రూముల ద్వారాలు ఒకే సైజులో ఉండేలా చేయించుకోవాలి.

Vastu Tips If you forgot and did this, you are poor
Vastu Tips If you forgot and did this, you are poor

ఇలా చేస్తే వాస్తు ప్రకారం సరిపోతుంది అప్పుడు ధన సమస్యలు ఎదురుకావు. ఇక కొంతమంది ఇళ్లల్లో కొళాయిల నుంచి నీరు ఎల్లప్పుడూ లీక్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంత టైట్ గా బిగించినా సరే ట్యాంకులు, ఇతర పైపుల నుంచి నీరు లీక్ అవుతూ ఉంటుంది. ఇలా జరిగితే ఇంట్లో ధనం నష్టం తప్పదు. ఎక్కువగా ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. ఒకవేళ ఇంట్లో నీళ్ల లీకేజీలు ఉన్నట్లయితే వెంటనే సరి చేయడం మంచిది. అప్పుడే సంపాదించిన ధనం ఇంట్లో నిలుస్తుంది. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇక పగిలిపోయిన విరిగిపోయిన వస్తువులను కూడా ఇంట్లో పెట్టకూడదు. కనీసం స్టోర్ రూమ్ లో కూడా వాటిని పెట్టడం మానేయండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాస్తు దోషాలు లేకుండా ఆర్థిక సమస్యలతో పాటు మరో ఇతర సమస్యలైనా మీ దరిచేరవు.