Vastu Tips : హిందూ సంప్రదాయం ప్రకారం వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా కొత్త ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు లేదా కొత్త ఇంటిని నిర్మించేటప్పుడు తప్పకుండా వాస్తు శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఇంటిని నిర్మించుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇకపోతే వాస్తు శాస్త్రాన్ని కాదని మనం ఇంటిని నిర్మించుకున్నట్లయితే ఏదో ఒక సమస్యలు తలెత్తుతాయని ఫలితంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు.. ఆర్థిక ఇబ్బందులు .. మనశాంతి లేకపోవడం.. సంతోషం కరువవడం లాంటి సమస్యలు ఎక్కువ అవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి విషయంలో కూడా వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని సమాచారం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాదు ఇంటి లోపల ఉంచే వస్తువులు అలాగే ఇంటి బయట ఇంటి ముందు పెట్టే వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలట. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఉండే వస్తువులే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులు కూడా మీ ఆర్థిక పరిస్థితి పై ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి ఈ వస్తువుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఈ వస్తువులను మీరు ఇంటి యొక్క ప్రధాన ద్వారం ముందు ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంపదపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిలో ఇంటి ప్రధాన ద్వారం ముందు స్తంభం నిలబడి ఉండడం అంత శ్రేయస్కరం కాదు. ఇలా జరిగితే ఆ ఇంటిలోని స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్థితి దిగజారుతుంది.

ఆమె అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇకపోతే ఇంటి ముందు కూడా మెట్లు కట్టకూడదు. ఇలా చేస్తే ఆ ఇంట్లోనే వ్యక్తులకు ఆర్థిక సమస్యలతో పాటు ఉద్యోగం లేదా వ్యాపార పురోగతిలో నష్టాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఇల్లు కొనేటప్పుడు లేదా కట్టించేటప్పుడు గమనించాల్సిన అసలు విషయం ఏమిటంటే .. ఇంటి ప్రధాన ద్వారం ముందు పెద్ద పెద్ద చెట్లు ఉండకూడదు. వాస్తు ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెట్లు ఉంటే ఇంట్లో వ్యక్తుల పనులు అన్నింటిలో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. అంతేకాదు ఇంటి ముందు గుడి ఉండడం కూడా సరికాదు అని పెద్దలు చెబుతున్నారు. ఇక వీటిని గుర్తించి మీరు పలు జాగ్రత్తలు తీసుకుంటే వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండటమే కాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.