Vastu Tips : పూజలో భార్య భర్తకు ఎటువైపు కూర్చోవాలో తెలుసా..?

Vastu Tips : భార్య భర్త అనగానే ముందుగా గుర్తొచ్చేది పార్వతి పరమేశ్వరులే.. కదా. తనలో సగభాగన్ని ఇచ్చిన పరమేశ్వరుడికి అర్ధనారీశ్వరుడు అని పేరొచ్చింది. అంతటి పరమేశ్వరుడే పార్వతిదేవికి తన హృదయం వున్న ఎడమ వైపున చోటిచ్చాడు అంటే అర్థం అవుతుంది.. భార్య స్థానం ఎప్పుడూ భర్త గుండెల్లోనే అంటే ఎడమవైపేనని.ఎప్పుడైనా అర్ధనారీశ్వరుల దేవాలయమును సందర్శించినప్పుడు అందులో వున్న పూజారులు ఇలా సూచిస్తారు.. అయ్య వారిని చూడాలంటే ఎడమ కన్ను మూసుకొని కుడి కంటితో చూడు, అదే అమ్మవారిని చూడాలనుకుంటే కుడికంటిని మూసుకొని ఎడమ కంటితో చూడు సర్వపాపాలు తొలగి భార్య భర్తలు సుఖ సంతోషాలతో జీవితాంతం వుంటారు అని చెబుతారు.

ఎందుకు శివుడు కుడివైపు, పార్వతి దేవీ ఎడమ వైపు వున్నారంటే మానవ శరీరాన్ని నిలువుగా రెండు భాగాలుగా చేస్తే కుడివైపు శరీరంలో ని భాగాలు ఎడమవైపు భాగాలకంటే దృఢంగాను, శక్తివంతంగాను వుంటాయి. అంతేకాక బుద్ది బలం కూడా కుడివైపు ఎడమ వైపు కన్నా చురుకుగా ఉంటుంది.అందుకే కుడి వైపు సూర్యభాగమని, ఎడమ వైపు చంద్ర భాగమని పెద్దలు చెబుతుంటారు. కుడివైపు శరీర భాగాలతో పని చేసినట్టు ఎడమవైపు శరీర భాగాలతో పని చేయలేము.సూర్య నాడి కుడి వైపు ప్రసరిస్తే, చంద్ర నాడి ఎడమ వైపు ప్రసరిస్తుంది.కాబట్టి భర్త, భార్య ను కాపాడుతుండాలి, భార్య కాపాడే భర్తకు కష్టం సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉండాలి అనేది మన హిందూ సంప్రదాయం సూచిస్తుంది. గృహప్రవేశ సమయంలో కానీ, కొంతమంది సంవత్సరానికి ఒకసారి కానీ సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ వుంటారు.

Vastu Tips Do husband and wife know which side to sit in puja
Vastu Tips Do husband and wife know which side to sit in puja

అలా సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు కూడా భార్య..భర్త ఎడమ చేతి వైపు ఉండి ఏకగ్రత్తతో, భక్తితో ఆ మహా దేవుణ్ణి ఆరాధిస్తే వారి ఇంట్లో సకల సంతోషాలు కలిగి, వారికి మాత్రమే కాక వారి తరతరాలకు పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. మన హిందూ శాస్త్రం ప్రకారం ఏడు శనివారలు పూజ చేసేటప్పుడు కూడా భార్య భర్తలు ఇద్దరు కలిసి పూజ చేసి, 7నైవేద్యాలు సమర్పించి, ఇద్దరు కలసి పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని, ఇలా చేస్తే ఎంతటి అప్పులయినా మంచు ముక్క కరిగినట్టు కరిగి పోతాయని సూచిస్తుంది. భార్య ఎప్పుడు భర్తకు ఎడమ వైపు ఉండి పూజలు చేయాలనీ, అలా చేస్తేనే పూజలకు ఫలితం ఉంటుందని,అలాగే భర్త హృదయంలో భార్య చోటు సంపాదించాలని,భర్త సుఖదుఃఖాల్లో పాలు పంచుకోవాలని, అలాగే భర్త కూడా భార్య ను అర్థం చేసుకొని, ఆమె కు వచ్చే ప్రతి కష్టంలో తోడుగా, నీడగా ఉండాలని మన పెద్దలు మనకి సూచనలు ఇస్తుంటారు.