Vastu Tips : అప్పుల బాధలు పీడిస్తున్నాయా? అయితే ఈ టిప్స్ తో పరిష్కారం..!

Vastu Tips : సాధారణంగా చాలామంది ఎంత డబ్బు సంపాదించినా సరే ఆ డబ్బు వృధాగా ఖర్చు అవ్వడమే కాకుండా అదనంగా ఇతరుల నుంచి డబ్బు అప్పుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్పులు మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనీయవు. ఆదాయానికి మించిన ఖర్చు ప్రాణాలను హరింప చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అందుకే ఆచితూచి అప్పుల విషయంలో అడుగులు వేయాలని నిపుణులు సైతం సూచిస్తూ ఉంటారు. అయితే మీరు కూడా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఇంట్లో కొన్ని రకాల మొక్కలు నాటడం వల్ల శుభం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

మరి ఆ మొక్కలు ఏంటో? ఇంట్లో ఏ దిశలో నాటాలో? ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లను పెంచే ఆచారం ఇప్పటికీ ఉంది. ఈ మొక్కలు ఇంట్లో సానుకూల శక్తిని పెంపొందిస్తాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా కలిగిస్తాయి. ఇక మనిషి జీవితంలో సంతోషం, శాంతి , సంపదలు రావడానికి ఈ మొక్కలు ఎంతగానో సహాయపడతాయి. అలాంటి మొక్కల్లో మనీ ప్లాంట్ కూడా ఒకటి. ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడుతుంది అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా కొన్ని ప్రత్యేక మొక్కలు నాటడం వల్ల ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవచ్చు.

Vastu Tips are you suffering from debt but the solution with these tips
Vastu Tips are you suffering from debt but the solution with these tips

దానిమ్మ మొక్క : ఇంటి ప్రధాన ద్వారం కుడివైపున దానిమ్మ మొక్క ఉంటే ఆ ఇంటి పెద్ద అదృష్టం పెరుగుతుంది. ఈ మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవిని, కుబేరుడుని ఆకర్షిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కలు నాటడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించలేదు. తద్వారా మీ ఆర్థిక సమస్యలన్నీ దూరం అవుతాయి.

బిల్వపత్రి మొక్క : పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మొక్క ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నాటాలి. ఈ మొక్కను నాటడం వల్ల అనవసర ఖర్చులు తగ్గడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఇంటి ముందు బిల్వ పత్రి మొక్క ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇంటి ముందు బిల్వపత్రి మొక్కను తప్పకుండా నాటడం శుభప్రదం.

శమీ వృక్షం : దీనినే జమ్మి చెట్టు అని కూడా పిలుస్తారు. పురాతన కాలం నుంచి అత్యంత పవిత్రమైన మొక్కగా పేరుగాంచిన ఈ వృక్షం.. ఇంటి ప్రధాన ద్వారం ఎడమవైపున నాటడం వల్ల శ్రేయస్కరం. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఆ కుటుంబ సభ్యుల పైన ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇలాంటి చిన్నచిన్న వాస్తు చిట్కాలను మీరు అనుసరించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి సంపాదన పెరుగుతుంది. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి . అప్పుల బాధలు తీరిపోతాయి అప్పుడు మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండవచ్చు.