Ugadhi : ఈ ఏడాది శోభకృత్ నామ సంవత్సరం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ పార్టీల భవిష్యత్తు పంచాంగం వార్తలు వైరల్ గా మారాయి. ఏపీ పొలిటికల్ పంచాంగం బట్టి చూస్తే శోభకృత్ నామ సంవత్సరంలో జగన్ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ కి గురు బలం తగ్గటంతో శని బలం పెరగడంతో… అనుకూలంగా ఉన్న గ్రహాలు ప్రతికూలంగా మారాయంట. దీంతో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నుండే ఈ ప్రభావం స్టార్ట్ అయిందట.
జగన్ జాతకంలో శని ప్రభావం ఉన్న కొద్ది పెరగటం తప్ప తగ్గే ప్రసక్తి లేదని పంచాంగం పండితులు చెబుతున్న టాక్. మరోపక్క పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తిరుగులేని విజయాలు సాధించిన తెలుగుదేశం పార్టీ… మరింతగా పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు. కారణం చూస్తే చంద్రబాబు జాతకంలో గురుబలం పెరిగిందంట. దీంతో బాబు గారీ అనుకూలంగా ఉన్న గ్రహాలు.. జగన్ రెడ్డి ప్రతికూల గ్రహాలు… రాబోయే రోజుల్లో టీడీపీకీ విజయాలు తీసుకురాబోతున్నట్లు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో బాబు గారి గురు బలానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురుబలం కలిస్తే… ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వచ్చే ఎన్నికల్లో మారబోతుందట. ఇక తెలంగాణ విషయానికొస్తే కేసీఆర్ కీ శోభకృత్ నామ సంవత్సరంలో చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురు కాబోతున్నాయట. కానీ న్యాయపరంగా అన్ని కూడా అనుకూలంగానే తీర్పులు వస్తాయని పంచాంగ పండితులు వివరించారు.
ముఖ్యంగా బీజేపీతో ప్రారంభంలో రాసుకొని పూసుకుని తీరగటం ఇప్పుడు నువ్వా నేనా అనటంతో… పరిస్థితులు మొత్తం మారిపోయాయి. మరోపక్క బీజేపీ పార్టీ పరిస్థితి చూస్తే అంతర్గత విభేదాలతో ఆ పార్టీ బలహీనపడే అవకాశం..ఉందనీ పంచాంగ పండితులు అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ అవినాష్ రెడ్డి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత పరిస్థితి బట్టి… రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీల నేతలు కొన్ని తలనొప్పులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు.. పండితులు హెచ్చరించడం జరిగింది. ఏది ఏమైనా శోభకృత్ నామ సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీల నేతలకి ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నట్లు పంచాంగ పండితులు తెలియజేయడం జరిగింది.