TTD Brahmotsavams : శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు సెప్టెంబర్ 27 నుండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రెండేళ్ళుగా కోవిడ్ కారణంగా బ్రహ్మోత్సవాలను శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించడం జరిగింది.. కోవిడ్ ప్రభావం పూర్తిగా అదుపులోనికి రావడంతో ఈ ఏడాది ఆలయం బయట నిర్వహించాలని నిర్ణయించారు. రెండేళ్ల తరువాత నిర్వహించే ఉత్సవాలను వీక్షించడానికి అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. ఈ క్రమంలోనే తిరుమలలో అందుకు తగిన ఏర్పాట్లను టీటీడీ చేస్తున్నారు.సెప్టెంబర్ 27 నుండి ప్రారంభం కానున్న ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు రెండు నెలల నుండే టిటిడీ ఏర్పాట్లను మొదలుపెట్టింది. శ్రీవారి వాహనసేవలు జరిగే ఆలయ మాఢ వీధులతో పాటు ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. హరివిల్లులతో పాటు విద్యుత్, పుష్ప దీపకాంతులతో తిరువీధులను దేదివ్యమానంగా ఉండే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు.
వాహనసేవలను చూసేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా. పటిష్టంగా బారికేడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ ముందు భాగంలో ఉండే ఖాళీ స్థలంలో కూడా వేలాదిమంది భక్తులు వాహనసేవలో స్వామి వారి వైభవాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. బ్రహోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు తొమ్మిది రోజుల పాటు 16 వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం వాహనసేవల సమయంను ఉదయం 8 గంటలకు నిర్వహిస్తే, రాత్రి 7 గంటలకే వాహనసేవలను ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించడం జరిగింది. సెప్టెంబర్ 26 న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్ర బద్ధంగా నిర్వహించాలని ఆలయ అర్చకులు తెలియజేశారు. సాయంత్రం 5:15 గంటల నుంచి 6:15 నిమిషాల వరకు శ్రీవారి ధ్వజారోహణ కార్యక్రమంను అర్చకులు శ్రీవారి ఆలయంలో నిర్వహించుచున్నారు. దీనితో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.
అదే రోజు సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే పెద్ద శేషవాహనంలో బ్రహ్మోత్సవాల వేడుకలు మొదలు కానుంది. 28వ తేదీన ఉదయం 8 గంటలకు చిన్నశేషవాహనం, రాత్రి 7 గంటలకుసహనం, 29వ వేదీ ఉదయం 8 గంటలకు సింహవాహనం రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం, 30 వ తేదీ ఉదయం 8 గంటలకు కల్పవృక్షా వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం, అక్టోబర్ 1వ తేదీ ఉదయం 8 గంటలకు మోహిని అవతారం, రాత్రి 7 గంటలకు గరుడవాహనం, 2వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు హార్బరభు, రాత్రి 7 గంటలకు గజవాహనం, 3వ తేదీ ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం 4వ తేదీ ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనం, 5 తేదీ ఉదయం 6 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి.