మేషం : మిత్రులతో ఊహించని కలహాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని భాదిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు తప్పవు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది . వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కొంచెం జాగ్రత్త. వృషభం : కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో పురోగతి లభిస్తుంది . నూతన వాహనయోగం కనిపిస్తోంది. చిన్ననాటి మిత్రులు కలయిక మిమ్మల్ని ఆనందానికి గురిచేస్తుంది. ఆకస్మిక ధన లాభం వస్తుంది.
మిథునం : బంధుమిత్రులతో కొన్ని వివాహారాలలో విభేదాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారులు ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కర్కాటకం : ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయం సంతోషాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
సింహం : సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన గృహపకరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సంతృప్తి కలుగుతుంది. ఇంటా బయట వాతావరణం అనుకూలంగా కలుగుతుంది.
కన్య : మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు ఏర్పడతాయి. గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు . ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.
తుల : వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులు మాటలు చికాకు పరుస్తాయి. అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది.
వృశ్చికం : గృహ నిర్మాణం ప్రయత్నాలు వేగ వంతం చేస్తారు . ఆర్థిక వ్యవహారాలుగా ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఆప్తుల ఆగమనం సంతోషాన్ని కలిగిస్తుంది.
ధనస్సు : దూర బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
మకరం : కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగులకు చికాకుల పెరుగుతాయి .. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి.
కుంభం : వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు భాధ్యత ల వల్ల విశ్రాంతి ఉండదు . ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసిందే. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.
మీనం : వ్యాపారం ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులు కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది దాయాదులతో భూమి వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.