Daily Astrology : ఈరోజు రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు..!

Daily Astrology : శుభ కృత నామ సంవత్సరం
కార్తీక మాసం..
శరదృతువు..
దక్షిణాయనం..

మరి ఈరోజు శనివారం.. సూర్యోదయ సమయం ఉదయం 5:59 గంటలకు.. సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:36 గంటలకు.. వర్జ్యం రాత్రి 7:30 గంటల నుండి రాత్రి 9:04 గంటల వరకు.. అమృత ఘడియలు తెల్లవారుజామున 4:34 గంటల వరకు.. రాహుకాల సమయం ఉదయం 9:00 గంటల నుండి 10:30 గంటల వరకు.. యమగండ కాలం మధ్యాహ్నం 1:30 గంటల నుండి 3:00 గంటల వరకు.. మరి ఈ రోజు రాశి ఫలాలు.. ఎవరికి ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

Today horoscope..these zoadic signs are get financial issues
Today horoscope..these zoadic signs are get financial issues

మేషం:
నిరుద్యోగులు మరింత శ్రమ పడాల్సి ఉంటుంది. ఆదాయం తగినంత ఉండదు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో చాలా జాగ్రత్త వ్యవహరించాలి. ఈరోజు అంతంత మాత్రంగానే ఈ రాశి వారికి కొనసాగుతోంది కాబట్టి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల కష్టాలను అధిగమించవచ్చు.

వృషభం:
వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు తెప్పిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు పోకుండా సంయమనం పాటించండి.

మిధునం:
ఇతర స్త్రీల పై వ్యామోహం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి పురుషులు అత్యంత జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. నూతన విషయాలు సేకరిస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్కాటకం:
ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విధాల మంచి జరుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి.

సింహం:
నిరుద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా సాగుతాయి. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేపట్టే ముందు పెద్దల సలహాలు తప్పనిసరి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు తప్పవు. దైవ సేవ కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు.

కన్య:
విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇతరులకు మాట ఇచ్చే విషయంలో ఆలోచించి ముందడుగు వేయండి . దైవ సేవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది . అలాగే చేపట్టిన పనుల్లో ఒత్తిడి అధికమైన సరే సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి.

తుల:
నూతన ప్రారంభ కార్యక్రమానికి అవరోధాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి . ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. సోదర స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

వృశ్చికం:
వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది.

ధనస్సు:
వృత్తి , ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగులు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

మకరం:
అప్పుల బాధలు మరింత బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగం పరంగా ఒడిదుడుకులు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

కుంభం:
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు కొంత అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం కూడా లభిస్తుంది.

మీనం:
ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు అమలు చేస్తారు.