Zodiac Signs : ఈ రాశుల వారికి ఈ వారం ఆదాయం పెరుగుతుంది గ్యారెంటీ మాది !

Zodiac Signs : ఈ వారం రోజుల 12 రాశుల అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఇలా ఉన్నాయి. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ధనలాభం ఉంటే మరికొన్ని రాశుల వారికి మాత్రం రాజ‌కీయ రంగాల వారికి ఉత్తమైన ఫలితాలున్నాయి. సెప్టెంబరు 19 సోమవారం నుంచి 25 ఆదివారం ఈ వారంలో తూలా రాశి నుండి మీనరాశి వరకు ఆరు రాశుల ఫలితాలను చూద్దాం.

మేషరాశి (అశ్విని, భరణి, కృత్తిక 1 ) : ఈ వారం నిరుద్యోగులకు శుభవార్త. మంచి సంస్థలో ఉద్యోగం లభించే సూచనలున్నాయి. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. రుణబాధలు తొలిగిపోతాయి. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృషభరాశి (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : వృషభరాశికి ఈ వారం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. విద్యార్థులకు శ్రమ అధికమతంది. ఐటి, వైద్య విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కోర్టు వివాదాలు సర్ధుమణుగుతాయి.

మిధున రాశి (మృగశిర 3,4, అర్ర‌, పునర్వసు 1,2,3): ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు. కష్టాల్లో ఉన్న బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అష్టమ శని నడుస్తుంది. కాబట్టి అనారోగ్యం బాధిస్తుంది. బంధువుల సహాయం మీకు అందుతుంది. ఈ వారం విద్యార్థులకు మంచి ఫలితం వస్తుంది. కర్కాటక రాశి ( పునర్వసు 4 , ఆశ్లేష పుష్యమి) :ఈ వారం ఈ రాశి వారికి బంధు మిత్రులలో విలువ పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలకి అవకాశం ఉంది. విదేశీయాన సూచలున్నాయి. ఆర్ట్స్,సైన్స్ రంగంలోకి విద్యార్థులకు అనుకూలంగా ఉంది. సప్తమ శని కారణంతో వారం మధ్యలో ప్రయాణాలు, పని ఒత్తిడి ఉండే అవకాశం .

Today Horoscope September 22 2022 Check Your Zodiac Signs
Today Horoscope September 22 2022 Check Your Zodiac Signs

సింహరాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1 ) : ఈ రాశికి ఈ వారంలో వీరికి ఎప్పటినుంచో ఉన్న వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. బంధువులతో సుఖంగా కాలం గడుపుతారు. వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉన్నది. ఆరోగ్యం కుదురుపడుతుంది. కోర్టు కేసులు అనుకూలంగా ఉండడం జరుగుతుంది.

కన్యారాశి ( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) : ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు. తగ్గుముఖం పడతాయి. వారం మధ్యలో – వృధా వ్యయం అయ్యే అవకాశాలున్నాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. దూరప్రయాణాలు చేస్తారు. విదేశాల నుండి శుభవార్తలు వింటారు.

తులారాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ వారం ఈ రాశి వారికి నాలుగులో శని, ఆరులో గురు సంచారం వల్ల ఈ వారం అనుకూలంగా లేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు అనుకూలం. కోర్టు కేసుల్లో విజయం పొందుతారు. ప్రేమ వ్యవహారాలు సత్ఫలితాలు ఇవ్వవు. స్పెక్యులేషన్ వల్ల లాభం ఉండదు.

వృశ్చికరాశి (విశాఖ 4, అనూరాధ, జేష్ట్య): ఈ రాశి వారికి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. గృహలాభం పొందుతారు. భార్యపిల్లల‌ సహాయం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. డబ్బు విషయంలో జాగ్ర‌త్త‌లు అవసరం. కుటుంబంలో ఒకరికి వివాహం జరిగే అవకాశం ఉంది.

ధనస్సురాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ): ఈ వారం సహనంతో ఉంటే మీ లక్ష్యాలను నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. రుణాలు తీర్చే అవకాశం ఉంది. భాగస్వామితో వివాదాలు దూరమయి అన్యోన్యంగా ఉంటారు. ఇల్లుకోసం ఆలోచిస్తారు. ఉదోగ్యంలో పని ఒత్తిడి పెరుగుతుంది.

మకరరాశి ( ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఎటువంటి పురోగతి కనిపించదు. వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు ఈ వారంలో కలిగే అవకాశాలున్నాయి. సంఘంలో గౌరవం ఉంటుంది.

కుంభరాశి (ధనిష్ట 3, 4 శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలుంటాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. కోర్టుకేసులకు అనుకూలంగా ఉంది. అప్పు తీర్చే ప్రయత్నం చేస్తారు.

మీనరాశి (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ వారం వీరికి శని, గురువు లాభస్థానంలో ఉండటం వలన శుభపరిణామాలు ఉంటాయి. ఈ వారం ప్రశాంతంగా గడుస్తుంది. పెళ్లి ప్రయత్నాలు లాభిస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.