Daily Astrology : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

Daily Astrology : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఈరోజు పంచాంగం ఒకసారి చూసి తెలుసుకుందాం. సూర్యోదయం ఉదయం 5:59 గంటలకు.. సూర్యాస్తమయం సాయంత్రం 5:36గంటలకు. రాహుకాలం పగలు 1:30 గంటల నుండి 3:00 గంటల వరకు.. యమగండాకాలం ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 గంటల వరకు.. వర్జము సాయంత్రం 6:08 గంటల నుండి 7:39 గంటల వరకు.. అమృత ఘడియలు తెల్లవారుజామున 3:21 గంటల నుండి 4:53 గంటల వరకు కొనసాగుతుంది.

Daily Astrology : మరి నేటి రాశిఫలాలు విషయానికి వస్తే..

మేషం : ఉద్యోగపరంగా అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మీ ఉద్యోగరీత్యా ఈరోజు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు . కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. బంధువుల విషయంలో మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు భాధిస్తాయి. వృషభం : ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే.. భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

Today Horoscope October 27 2022 Check Your Zodiac Signs
Today Horoscope October 27 2022 Check Your Zodiac Signs

మిధునం : వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు కూడా అందుతాయి. కర్కాటకం : ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ఆకస్మిక ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయాణాలు మందగిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి.

సింహం : చేపట్టిన పనుల్లో అవరోధాల కారణంగా వృత్తి వ్యాపారాలు కూడా నిరాశ కలిగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చు ఉంటుంది . ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలగవచ్చు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించండి.

కన్య : వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన శుభకార్య విషయాలలో చర్చలు సాగుతాయి. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి.

తుల : మిత్రులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు కలగవచ్చు. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా మారుతుంది.

వృశ్చికం : వ్యాపార విషయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు . ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

ధనస్సు : చేపట్టిన పనులు అవరోధాలు తప్పవు. వృత్తి వ్యాపారాల్లో ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. దైవచింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకును కలిగిస్తుంది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించండి.

మకరం : దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశాలు పొందుతారు . ఉద్యోగంలో ఉన్నతాధికారులతో సఖ్యత పెరుగుతుంది . వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి.

కుంభం : పాత మిత్రుల రాకతో మీ ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

మీనం : చేపట్టిన పనుల్లో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.