Zodiac Signs : నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటే..?

మేషం :  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి మందకొడిగా సాగుతుంది. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు పనికిరావు. ఇంటా బయట మానసిక సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం తప్పదు. వృషభం : చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

మిధునం : మానసిక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని పూర్తిగా బాధిస్తాయి. మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే కొనసాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. అనుకున్న పనులు జరగక నిరాశ పెరుగుతుంది. కర్కాటకం : స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి కూడా లభిస్తుంది.

Today Horoscope Check Your Zodiac Signs 
Today Horoscope Check Your Zodiac Signs

సింహం : ఈరోజు ఈ రాశుల వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. విందు , వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

కన్య : ఉద్యోగ వాతావరణం ఇబ్బందిగా ఉంటుంది. బంధువులు స్నేహితులతో ఊహించని కలహాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తప్పనిసరి. ఆదాయానికి మించి ఖర్చు పెరుగుతుంది.

తుల : ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడ లోపిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు పెరుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు తలెత్తుతాయి.

వృశ్చికం : నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో విలువ పెరుగుతుంది.

ధనస్సు : నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు.

మకరం : ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడే అవకాశం ఉంది.

కుంభం : రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసి రావు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

మీనం : పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు లభిస్తాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.