Daily Astrology : మేషం:
ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి, బంధుమిత్రుల వల్ల కొన్ని ఊహించని సమస్యలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది.
వృషభం:
ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు.
మిధునం:
దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు.
కర్కాటకం:
ఆర్థిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు.
సింహం:
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు భాధిస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనులలో ఒడిదుడుకులు తప్పవు.
కన్య:
దూర బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.
తుల:
భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు . చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. శత్రు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
వృశ్చికం:
కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇతరుల విషయాలను తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు.
ధనస్సు:
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమును కొన్ని పరిస్థితులు చికాకు పరుస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.
మకరం:
ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించి లాభాలను అందుకుంటారు.
కుంభం:
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపార ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.
మీనం:
విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ధన ఆదాయం పెరుగుతుంది.