Daily Astrology : నేటి రాశి ఫలాలు.. 29 నవంబరు 2022 మంగళవారం రాశి ఫలాలు..!

Daily Astrology : మేషం:
చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో పురోగతికి చేసిన ప్రయత్నాలు కలిసోస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో వృత్తి ఉద్యోగమును సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సలహాలు లేకుండా ముందుకు సాగడం మంచిది.

Today horoscope.. 29-11-2022 Tuesday horoscope..!
Today horoscope.. 29-11-2022 Tuesday horoscope..!

వృషభం:
నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రతి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. నూతన వస్తు వాహన లాభాలు కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాధి కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధునం:
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిలకడ రాణించవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులు ఉంటాయి. ఇంటా బయట నూతన సమస్యలు కలుగుతాయి.

కర్కాటకం:
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. వ్యాపార విషయమై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

సింహం:
ఇంకా బయట గౌరవ మర్యాదలు పొందుతారు. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులను పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కన్య:
వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు. ధన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల:
దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

వృశ్చికం:
కీలక వ్యవహారాలలో తొందరపాటు వల్ల గొందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపార విషయాలలో భాగస్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మిత్రుల నుండీ ఊహించని రుణ ఒత్తిడి కలుగుతుంది.

ధనస్సు:
బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం లభిస్తుంది. వ్యాపారమున సమస్యలను పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

మకరం:
జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగమును స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.

కుంభం:
నూతన వస్త్ర , ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు.

మీనం:
బంధు వర్గంతో విభేదాలు ఏర్పడతాయి. ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. ఇంటా బయటా చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి.