Daily Astrology : నేటి రాశి ఫలాలు..27 నవంబర్ 2022 ఆదివారం రాశి ఫలాలు..!

Daily Astrology : మేషం:
ఆదాయం తగినంత లభించదు. దైవ సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగమున కీలక పత్రాల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

Advertisement
Today horoscope..27-11-2022.. Sunday horoscope..
Today horoscope..27-11-2022.. Sunday horoscope..

వృషభం:
చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మానసికంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించండి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి.

Advertisement

మిధునం:
వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి.

కర్కాటకం:
వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. సకాలంలో రావలసిన సొమ్ము వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

సింహం:
దైవ సేవ కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకోని ముందుకు సాగితే కలిసి వస్తుంది.

కన్య:
ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

తుల:
వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపార వ్యవహారాలు మందకొడి గా కూడా సాగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి.

వృశ్చికం:
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ధనస్సు:
దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు.

మకరం:
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరోబాధను కలిగిస్తాయి. ధన పరంగా ఒడిదుడుకుల తప్పవు.. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి వల్ల నూతన రుణాలు చేయవలసి వస్తుంది.

కుంభం:
రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున స్థానచలనాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది.

మీనం:
ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్లకపోవడమే మంచిది. వృత్తి ఉద్యోగమున పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు . నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలుపరుస్తారు.

Advertisement