Daily Astrology : నేటి రాశి ఫలాలు.. 26 నవంబరు 2022.. శనివారం రాశిఫలాలు..! 

Daily Astrology : మేషం:
చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి.

Today horoscope..26-11-2022.. Saturday horoscope
Today horoscope..26-11-2022.. Saturday horoscope

వృషభం:
వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

మిధునం:
మిత్రులందరికీ అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు.

కర్కాటకం:
విలువైన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాధి కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

సింహం:
ముఖ్యమైన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి.. సన్నిహితులతో మాట పట్టింపులు ఏర్పడతాయి.. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తప్పనిసరి.. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు తెప్పిస్తాయి.

కన్య:
చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి లభించదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విషయంలో అప్రమత్తంగా ఉండండి.

తుల:
ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

వృశ్చికం:
కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు . వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగుల అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు:
కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలవక కొత్త అప్పు చేస్తారు.

మకరం:
ముఖ్యమైన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మానసిక సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఏర్పడతాయి.

కుంభం:
దూర బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులకు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మీనం:
ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.