Daily Astrology : మేషం:
ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్త వ్యవహరించండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని విషయాలలో బంధువులు మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని మరింత సతమతం చేస్తాయి.

వృషభం:
స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఏర్పడతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
మిధునం:
వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. ఇంటా బయట పరిస్థితిలు అనుకూలిస్తాయి.. నూతన అవకాశాలు విద్యార్థులకు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభాన్ని అందజేస్తాయి.
కర్కాటకం:
వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
సింహం:
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులను మధ్యలో విరమిస్తారు. ఇంటా బయట సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.
కన్య:
ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.
తుల:
కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసిక చికాకులు కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులు కష్టపడ్డా కూడా ఫలితం లభించదు.
వృశ్చికం:
వృత్తి , వ్యాపారాలు విస్తరిస్తారు. కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల అనుగ్రహం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి.
ధనస్సు:
సోదరులతో అకారణకలహ సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండండి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి.
మకరం:
అనుకున్న రీతిలో అనుకున్న పనులు సాగుతాయి. ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
కుంభం:
సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి.
మీనం:
ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.