Daily Astrology : నేటి రాశి ఫలాలు.. 24 నవంబర్ 2022 గురువారం రాశి ఫలాలు..! 

Daily Astrology :  మేషం:
నిరుద్యోగుల శ్రమ వృధాగా మిగులుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలలో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం తప్పదు.

Today horoscope.. 24-11-2022 Thursday horoscope..!
Today horoscope.. 24-11-2022 Thursday horoscope..!

వృషభం:
జీవిత భాగస్వామితో దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది . స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

మిధునం:
స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుండి బయటపడతారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణ ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి.

కర్కాటకం:
వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరిస్తాయి. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.

సింహం:
నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు l. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగడం వల్ల తగినంత విశ్రాంతి లభించదు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది.

కన్య:
వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

తుల:
గృహమున కొందరు ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది . ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడతారు.

వృశ్చికం:
ఆదాయ మార్గాలు ఆనందాన్ని కలిగిస్తాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.

ధనస్సు:
వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత నిరుత్సాహ వాతావరణ ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

మకరం:
నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకొని మరింత ముందుకు సాగుతారు. ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

కుంభం:
వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేస్తే లాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు . చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

మీనం:
నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి.