Daily Astrology : మేషం:
వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో వివాదాలు సద్దమనుగుతాయి. నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు . ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులకు కలుసుకొని విందు వినోదాధి కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం:
వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. బందు వర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. అధిక కష్టంతో తక్కువ ఫలితం లభిస్తుంది. సోదరులతో భూమి వివాదాలు తొలుగుతాయి.
మిధునం:
కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు . సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారులకు సకాలంలో పెట్టబడులు అందుతాయి.
కర్కాటకం:
సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరిస్తాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.
సింహం:
సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం. అందుతుంది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. అధికారులతో వివాదాలు రాజీ అవుతాయి.
కన్య:
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి.
తుల:
నిరుద్యోగయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు.
వృశ్చికం:
నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి, కొన్ని విషయాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది . ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.
ధనస్సు:
రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి.. వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి..
మకరం:
సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. రాజకీయ వర్గాలలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.
కుంభం:
శారీరక , మానసిక అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి, ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.
మీనం:
కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంతవరకు చిరాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి . వృత్తి ఉద్యోగములు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.