Daily Astrolgy : నేటి రాశి ఫలాలు..20 నవంబర్ 2022 ఆదివారం రాశి ఫలాలు..!

Daily Astrolgy : మేషం:
చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దూర బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ విషయాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

Advertisement
Today horoscope..20 November 2022 Sunday horoscope
Today horoscope..20 November 2022 Sunday horoscope

వృషభం:
ఊహించని విధంగా.. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవచింతన పెరుగుతుంది. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి.

Advertisement

మిధునం:
శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి , వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన ప్రతి పనిలో కూడా అడ్డంకులు ఏర్పడతాయి. మాతృ వర్గ బంధువులతో మాట పట్టింపులు పెరుగుతాయి.

కర్కాటకం:
నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది . వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కారం అవుతాయి.

సింహం:
కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడతాయి.. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. దైవచింతన పెరుగుతుంది. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి.

కన్య:
ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంటా బయటా సమస్యలు ఏర్పడినప్పటికీ నిదానంగా పరిష్కరిస్తారు. ఉద్యోగమున అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు పొందుతారు.

తుల:
నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. దూర దేశసంచారం చేయవలసి వస్తుంది. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి.

వృశ్చికం:
ఇతరుల సహాయ సహకారాలతో ప్రశాంతత పొందుతారు. ధనాదాయ మార్గం పెరుగుతుంది. సంతానానికి మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలను అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

ధనస్సు:
చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.

మకరం:
సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలితాలు ఇస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.

కుంభం:
కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.

మీనం:
గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలను సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

Advertisement