Daily Astrology : రాశి ఫలాలు..19 నవంబర్ 2022 శనివారం రాశి ఫలాలు..! 

Daily Astrology :  మేషం:
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగులకు అదునపు పని భారం తప్పదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఏర్పడుతుంది. బంధు వర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడును అందడంలో నిదానం అవుతుంది.

Today horoscope.. 19 November 2022.. Saturday horoscope..!
Today horoscope.. 19 November 2022.. Saturday horoscope..!

వృషభం:
ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు. ఆదాయం అంతగా కనిపించదు. ఒత్తిడి పెరుగుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

మిధునం:
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆశించిన లాభాలు అందుకుంటారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు

కర్కాటకం:
ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థానాచలన సూచనలు ఉన్నాయి. ఆలయ దర్శనాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.

సింహం:
దూరప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు కలిసోస్తాయి. ధన పరంగా ఇబ్బందులు కలుగుతాయి, ఉద్యోగస్తులకు అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి.

కన్య:
వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలం అవుతాయి. భూ వివాదాలు మానసిక చికాకు కలిగిస్తాయి.

తుల:
నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో సముద్యోగులతో చక్కగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి . ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

వృశ్చికం:
స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.

ధనస్సు:
కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్నేహితులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి.

మకరం:
ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వల్ల తగిన విశ్రాంతి లభించదు. స్థిరాస్తి విషయంలో సోదరులతో వివాదాలు ఏర్పడతాయి.

కుంభం:
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మీ కలయిక చిన్ననాటి మిత్రులకు ఆనందం కలిగిస్తుంది . విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం:
వ్యాపారాలలో కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి