Daily Astrology : నేటి రాశి ఫలాలు..17 నవంబర్ 2022 గురువారం రాశి ఫలాలు..!

Daily Astrology :  మేషం:
శ్రమాధిక్యతతో దూరప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడిలు తప్పవు.

Today horoscope.. 17-11-2022 Thursday horoscope
Today horoscope.. 17-11-2022 Thursday horoscope

వృషభం:
చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. ఉద్యోగాలలో ఊహించని స్థాన చలనాలు కలుగుతాయి. ప్రయాణాలలో మార్గం మధ్యలో అవరోధాలు ఏర్పడతాయి. ప్రత్యర్థుల నుంచి ధన పరంగా ఒత్తిడిలు పెరుగుతాయి . దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిధునం:
వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

కర్కాటకం:
బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు
మానసిక ప్రశాంతతకు ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు చికాకు కలిగిస్తాయి.

సింహం:
ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య:
అనారోగ్య సమస్యలు స్వల్పంగా బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. మిత్రులతో కలహాలు కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

తుల:
సంతాన విద్యా విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. రాజకీయ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి

వృశ్చికం:
ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాధి కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు:
వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో కార్యాటంకాలు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏర్పడతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ వాతావరణం చికాకు పరుస్తుంది.

మకరం:
జయప్రయాసలతో కానీ పనులలో పూర్తిగా ఖర్చులు పెరుగుతాయి . ఉద్యోగులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు . భాగస్వామ్య వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి.

కుంభం:
కీలక సమయంలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆకస్మిక ధన లాభాలు జీవిత భాగస్వామి నుంచి పొందుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు . నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

మీనం:
నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది . వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు అందుకొంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందు వినోదాధి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు.