Daily Astrology : నేటి రాశి ఫలాలు..16 నవంబర్ 2022 బుధవారం రాశి ఫలాలు ఇవే..!

Daily Astrology : మేషం:
ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు రావలసిన అవకాశాలు అందక నిరాశ పెరుగుతుంది. మాతృ వర్గ బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి.

Today horoscope.. 16 -11-2022 Wednesday horoscope..!
Today horoscope.. 16 -11-2022 Wednesday horoscope..!

వృషభం:
ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయం అందుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

మిధునం:
మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయంలో తొందరపాటు ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇతరులతో వివాదాలకు పోకండి.

కర్కాటకం:
ముఖ్యమైన పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది . కుటుంబ విషయంలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు.

సింహం:
గృహమున కొందరి ప్రవర్తన మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి రావు.

కన్య:
రుణపరమైన సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారాలలో అంచనాలను దాటి లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

తుల:
ఆర్థిక ఇబ్బందులు అధిగమించి దీర్ఘకాలిక రుణాలు సైతం తీర్చగలుగుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

వృశ్చికం:
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు . ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో విశేషంగా పాల్గొంటారు.

ధనస్సు:
శారీరక , మానసిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నచిన్న విభేదాలు తప్పవు. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. ఇతరులపై మీ ఆలోచన విధానం మార్చుకోండి.

మకరం:
నూతన వస్తు వాహన సౌకర్యాలు పొందుతారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాఘమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు.

కుంభం:
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో సోదరుల సలహాలు తీసుకోండి.

మీనం:
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ధన విషయాలలో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వకండి ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి.