Daily Astrology : నేటి రాశి ఫలాలు.. 1 డిసెంబర్ 2022 గురువారం రాశి ఫలాలు..! 

Daily Astrology :  మేషం:
ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు పొందుతారు. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

Today horoscope..1-12-2022.. Thursday horoscope..!
Today horoscope..1-12-2022.. Thursday horoscope..!

వృషభం:
ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.

మిధునం:
బంధుమిత్రులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి కుటుంబ సభ్యులు మీ మాటలతో విభేదిస్తారు.

కర్కాటకం:
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట చికాకుల తప్పవు. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. నిరుద్యోగయత్నాలు మందగిస్తాయి. అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు.

సింహం:
విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

కన్య:
సన్నిహితులతో వివాదాలు సాధ్యమవుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వివాహాది కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.

తుల:
కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలలో వివాదాలు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు. శ్రమాదిక్యతతో కానీ పనులు పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరిస్తాయి.

వృశ్చికం:
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఏర్పడుతుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త తప్పనిసరి. దూరప్రాంతాల మిత్రుల నుండి అందిన సమాచారం మానసిక బాధను కలిగిస్తుంది.

ధనస్సు:
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మకరం:
కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వ్యాపారంలో భాగస్వామితో వివాదాలు ఏర్పడతాయి. సంతానం విద్యాపరంగా మరింత సాధించడం మంచిది.

కుంభం:
చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అవరోధాలు అధిగమించి పదోన్నతులు పొందుతారు.

మీనం:
చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ప్రతిఫలం లభించదు. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనిచేయదు. ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.