Daily Astrology : రాశి ఫలాలు..04 డిసెంబర్ 2022 ఆదివారం రాశి ఫలాలు..!

Daily Astrology : మేషం:
ధనపరంగా చేసే ప్రయత్నాలు కలిసి రావు.. చేపట్టిన వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగమున స్థాన చలన సూచనలు ఉన్నాయి. ఇతరులతో అకారణ విభేదాలు కలుగుతాయి.

Advertisement
Today horoscope..04-12-2022 Sunday horoscope..! 
Today horoscope..04-12-2022 Sunday horoscope..!

వృషభం:
ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి, ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

Advertisement

మిధునం:
బంధుమిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం నెలకొంటుంది. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటకం:
చాలాకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగ విషయంలో అధికారుల సహాయం లభిస్తుంది.

సింహం:
వృత్తి , వ్యాపారాలలో అధిక కష్టంతో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడతాయి.. సంతానపరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి.

కన్య:
ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సౌకర్యాలకు లోటు ఉండదు. నూతన వాహన లాభం కలుగుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తి సంబంధిత క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

తుల:
చిన్ననాటి మిత్రులతో శుభకార్య విషయాలు చర్చిస్తారు. ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

వృశ్చికం:
శ్రమాదిక్యతతో కానీ పనులు పూర్తికావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.

ధనస్సు:
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో జాప్యము కలుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి.

మకరం:
దూరప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి.. వ్యాపారమున ఆటంకాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగమున కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది.

కుంభం:
ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి.. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మీనం:
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ఆత్మీయుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

Advertisement