Laxmi Devi : ప్రపంచమంతా ఇప్పుడు ఎక్కువగా డబ్బు మయంతోనే నిండి ఉంది. ఎవరు ఎలాంటి పని చేయాలన్నా, ఎవరైనా ఎక్కడికైనా వెళ్లాలన్న డబ్బు లేనిదే కుదరదు. డబ్బు వల్ల మనిషికి మనిషికి ఉన్న బంధాలను కొన్నిసార్లు దూరం కూడా చేస్తూ ఉంటుంది. మరికొన్ని సందర్భాలలో దగ్గరగా చేస్తుంది. అయితే ఎప్పుడైతే ఒక మనిషి దగ్గర డబ్బులు లేకపోతే.. అప్పుడు బంధుత్వాలు బాంధవ్యాలు ఏవీ ఉండవు అని చెప్పవచ్చు. ప్రస్తుతం మానవ సంబంధాలు ఎక్కువగా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అయితే ఇలాంటి డబ్బు ఏదో ఒక చోట ప్రతి ఒక్కరికి అవసరం పడుతూనే ఉంటుంది. అయితే కొంతమంది పెద్దలు, శాస్త్రవేత్తలు మన ఇంట్లో డబ్బు శాశ్వతం గా ఉండాలంటే కొన్ని పరిహారాలు చేయనని చెబుతూ ఉంటారు. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

లక్ష్మీదేవిని డబ్బుకు ప్రతీకగా చూస్తూ ఉంటారు. ఇక అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని నియమాలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
1). ముందుగా మన ఇంటి చుట్టు ఆవరణంలో తులసి చెట్టు ఉండేలా చూసుకోవాలి. తులసి చెట్టు దగ్గర ఉదయం మరియు సాయంత్రం పూజించాలి.
2). మన ఇంట్లో ఉండే చీపురును ఎక్కడపడితే అక్కడ వారి వేయకూడదు. అలాగే చీపురును తొక్కకూడదు. చీపురుపుల్లలను తుంచి ఇంట్లో పడేయడం వల్ల, లక్ష్మీదేవి అనుగ్రహం కలగకుండా ఆగ్రహానికి గురి అవుతారని పండితులు తెలియజేస్తున్నారు.
3). లక్ష్మీదేవిని పూజించే చోట నెమలికన్ను ఉంచడం వల్ల.. లక్ష్మీదేవి అనుగ్రహం అతి త్వరగా కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.
ఇప్పుడు చెప్పబోయేవి అస్సలు చేయకండి..
1). మీ ఇంట్లో వారికి గాని, బంధువులకు గానీ, బయటి వారికి గాని.. తలకు నూనె రాయకూడదు ఆట. నూనె ఇవ్వడం వంటివి చేయడం వలన.. ఆ ఇంట్లో డబ్బు అసలు నిలవదట.
2). ముఖ్యంగా ఇంటి గుమ్మం దగ్గర.. ఏదైనా వీల్ చైన్స్ ని ఉంచితే.. ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ మొదలై అందరూ సంతోషంగా ఉంటారు
3). చివరిగా మనీ ప్లాంట్ ను ఇంట్లో ఉంచడం వలన మీ ఇంట్లోని ధనం బయటికి వెళదట. అయితే మనీ ప్లాంట్ ను ఇంట్లో ఆగ్నేయ దిశగా ఉంచడం వల్ల ధన ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది.