Zodiac Signs : ఈ రాశి వారికి అద్భుతమైన టైం స్టార్ట్ అయింది.. పట్టిందల్లా బంగారమే!

Zodiac Signs : ధనం మూలం ఇదం జగత్ అని అన్నారు పెద్దలు. అంటే దాని అర్థం ధనం చుట్టూ ప్రపంచం తిరుగుతుందని అర్థం. ప్రతి ఒక్కరూ ధనం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ధనం లేకుండా ఏ పని జరగదు. ప్రతి ఒక్కరు ధనవంతుడు అవ్వాలని, డబ్బు బాగా సంపాదించాలని కోరుకుంటారు. మన రాశిని బట్టి కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల చాలా తొందరగా ధనవంతులు కావచ్చు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశి వారు కొన్ని ప్రత్యేకమైన సూచనలను పాటించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలిగి స్పీడ్ గా ధనవంతులు అవ్వవచ్చు. కుంభ రాశిలో పుట్టిన వారు తూర్పు లేక ఉత్తర సింహద్వారాలు ఉన్నఇంట్లో నివాసం ఉండాలి.ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది.

Advertisement

ఈ రాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో దక్షిణ సింహద్వారం ఉన్న ఇంట్లో అసలు ఉండకూడదు. ఇలా ఉన్నట్లయితేవారికి ఆదాయం తగ్గుతుంది. ఈ కుంభ రాశి వారు ఆగ్నేయ మూలలో మాత్రమే పూల చెట్లను పెంచాలి. ఇలా మొక్కలను పెంచడం వల్ల కుంభ రాశి వారికి లక్ష్మీ కటాక్షం ఆ పూల మొక్కల ద్వారా కలుగుతుంది. ఈ కుంభ రాశి వారు ఇంటి ఆవరణలో మందార మొక్కలను పెంచుతూ ప్రతిరోజు నీళ్లు పోయడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా ఈ రాశి వారు హనుమంతుని ఆలయానికి వెళ్లి ఆ ఆలయ ప్రాంగణంలో ఒక రావి చెట్టును నాటి దానికి నీళ్లు పోయడం వల్ల జాతకరీత్యా దోషాలు పోయి త్వరలోనే ధనవంతులు అవ్వడానికి ఇది అద్భుతమైన పరిష్కారమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Advertisement
This Zodiac Signs has started a wonderful time for them
This Zodiac Signs has started a wonderful time for them

అదేవిధంగా ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్కలను నరకకూడదు. ఎన్ని చెట్లను నాటి వాటిని పెంచి పోషిస్తే ఈ కుంభ రాశి వారికి అంత మంచి జరుగుతుంది. మర్రి,రావి వంటి దేవత వృక్షాలను పెంచితే చాలా మంచిది. మీకు వీటిని పెంచడం కుదరకపోయినట్లయితే ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్లకు నీటిని పోయడం వలన కూడా లక్ష్మీదేవి కటాక్ష అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రతిరోజు ఈ కుంభ రాశి వారు ఓం సహ గురువై నమః అనే మంత్రాన్ని ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు జపించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయి చాలా త్వరగా ధనవంతులు అవుతారు. ఇంట్లో మీరు కుబేర యంత్రాన్ని ప్రతిష్టించుకోవడం వల్ల అపర కుబేరులు అవుతారు. ఈ కుంభరాశి వారు ఈ నియమాలను పాటించినట్లయితే చాలా త్వరగా ధనవంతులు కావచ్చు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు

Advertisement