Zodiac Signs : ఈ రాశుల వారికి సడన్ గా డబ్బు రాబోతోంది.. సిద్ధంగా ఉండండి, మిస్ అయితే మళ్ళీ రాదు!

Zodiac Signs : నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు ఆయా రాజుల వారి వృత్తి,ఉద్యోగం, డబ్బు, వ్యాపారానికి సంబంధించిన విషయాలను అంచనా వేస్తుంటారు. అక్టోబర్ 1తేదీ శనివారం నాడు ఆయా రాశుల వారి మనీ ఆస్ట్రాలజీ లేదా ధనజ్యోతిష్యం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషం (అశ్విని,భరణి, కృత్తిక -1): ఈరోజు మీకు పని ప్రదేశంలో అధికారులతో సంబంధాలుపెరుగుతాయి. ఈ రోజున మీకు డబ్బుతో పాటు లాభాలు వస్తాయి.వ్యాపారంలో అభివృద్ధిపెరుగుతుంది. విఘ్నేశ్వరుని పూజించండి. వృషభం ( కృత్తిక 2,3,4,రోహిణి, మృగశిర 1,2): ఈ రోజున మీరు ఆఫీస్ లో మాట్లాడకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.మీ అవసరాలను నియంత్రణలో ఉంచుకోవాలి లేనట్లయితే ఖర్చు బాగా పెరుగుతుంది. ఆంజనేయుడిని పూజించండి.

Advertisement

మిథునం ( మృగశిర 3,4,అర్ర, పునర్వసు1,2,3): ఈ రోజున మీకు వ్యాపారంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆఫీసులో పగతో ఏ పని చేయకూడదు. మీరు ప్రేమించే వారితో వివాదం తలెత్తే అవకాశం ఉంది. ప్రదర్శనల కోసం మీరు ఖర్చు చేస్తే అప్పలపాలవుతారు. సూర్య దేవుడిని పూజించండి. కర్కాటకం( పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): చాలా కాలం నుంచి నిలిచిపోయిన ప్రాజెక్టుల వల్ల ఈరోజు మీకు మెంటల్ స్ట్రెస్ వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఎవరికి ఏ విషయం గురించి అయినా వాగ్దానం చేయకూడదు. ఒకవేళ ఇలా చేస్తే భవిష్యత్తులో పశ్చాత్తాప పడతారు. విగ్నేశ్వరున్ని ఎర్రని పూలతో అర్ర్చించండి.

Advertisement
These zodiac signs will get money suddenly
These zodiac signs will get money suddenly

సింహం(మఖ,పుబ్బ, ఉత్తర 1): మీకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మ్యూచువల్ డీల్స్ చేయకుండా ఉండాలి. లేనట్లయితే మీకు నష్టం వస్తుంది. మీకున్న సమస్య వల్ల మీమనసు బలహీనంగా ఉంటుంది. ఈ రోజున వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. గోశాలకు దానం ఇవ్వండి.

కన్య( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): కొత్త వ్యక్తులను నమ్మేముందు వారి గురించి పూర్తిగా విచారించుకోవాలి. లేనట్లయితే మీరు చట్టపరమైన వివాదాల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. పెట్టుబడి పెట్టడానికి మంచి రోజు కానీ, నిపుణుల సలహా మేరకు కానీ పెట్టుబడి పెట్టాలి. బుధ గ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి.

తుల( చిత్త 3,4, స్వాతి,విశాఖ1,2,3): పెరుగుతున్న అవసరాలతో ఈ రోజున మీరు ఆర్థికంగా సతమతమవుతారు. దీని కారణంగా మీరు అప్పు కూడా తీసుకోవచ్చు. వ్యాపారులకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆన్ టైంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నించండి. చీమల కొరకు పిండిని పెట్టండి.

వృశ్చికం ( విశాఖ 4, అనురాధ, జేష్ట ): కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం. దీని కారణంగా ఆఫీసులో మీరు చేసే పనులపై ప్రభావం పడుతుంది. కుటుంబ సమస్యలను, ఆఫీసు పనులను వేరువేరుగా పెట్టడం మంచిది. మీకోసం కొత్త ఉద్యోగ అవకాశాలు సిద్ధంగా ఉండవచ్చు. జంతువులకు సేవ చేయండి.

ధనస్సు( మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1): ఈ రోజున మీకు ఆర్థికంగా అభివృద్ధి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ప్రేమించే వారి కోసం చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. వ్యాపారం చేసేవారు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. సరస్వతి దేవిని పూజించండి.

మకరం ( ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్ట1,2): మీ ఆర్థిక సమస్యలు ఈరోజు అలానే ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు. అనవసర ఖర్చులకోసం మీరు అప్పు చేసే అవకాశం ఉంది. మీరు ఈ రోజున ల్యాండ్ ప్రాపర్టీ పై పెట్టుబడి పెడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. శివలింగానికి అభిషేకం చేయండి.

కుంభం ( ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈరోజు మీరు ఆఫీసుకు సంబంధించిన పని గురించి ఆందోళన చెందుతారు. ఈరోజు మీ మైండ్ డిస్టర్బ్ గా ఉంటుంది మీ కుటుంబంలో మీ పైన తిరుగుబాటు జరిగే అవకాశం. వ్యాపారస్తులకు ఈరోజు అసంతృప్తిగా ఉంటుంది. భైరవ గుడిలో జెండా సమర్పించండి.

మీనం( పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈరోజు నిలిచిపోయిన పనుల గురించి ఆందోళన చెందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. కొత్తగా పెట్టుబడి అవకాశాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఈ రోజున ఉద్యోగులకు ప్రమోషన్ కూడా లభించవచ్చు. శ్రీ సూక్త పారాయణం చేయండి.

Advertisement