Zodiac Signs : ఈ మూడు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండండి.. మీకు డబ్బులు పోయే టైం వచ్చింది!

Zodiac Signs : ఈ రోజులలో ఏ పని మొదలు పెట్టాలన్న.. మంచి,చెడుల గురించి ఆలోచిస్తారు. తమకు ఈరోజు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి దిన ఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో నేడు( అక్టోబర్ 2 తేదీ) ఆదివారం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మేషరాశి : ఈ రోజున ఆర్థిక పరిస్థితుల్లో మీకు బలం చేకూరుతుంది. ఈరోజు ఉద్యోగం చేసే వ్యక్తులు కొన్ని మంచి సమాచారాలను వింటూ ఉంటారు. మీరు ఈ రోజున కుటుంబంలోని కొన్ని సమస్యల గురించిఆందోళన చెందుతారు. వృషభ రాశి : ఈ రోజున మీరు దానధర్మాలతో గడుపుతారు. మీరు మీ జీవిత భాగస్వామి కెరీర్ కోసం ఆలోచిస్తున్నట్లయితే.. శుభవార్త వింటారు. ఆదాయ వనరులు ఎక్కువ ఎదురైతే.. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి.

మిధున రాశి: ఈరోజు మొత్తం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఉపాధి కొరకు ఎదురుచూస్తున్న వ్యక్తులు మంచి అవకాశాలను పొందుతారు. ఈరోజు డబ్బుకు సంబంధించిన విషయంలో పిల్లలపై కోప్పడే అవకాశం ఉన్నది. ఈరోజు మీరు పాత స్నేహితుడిని కలుసుకుంటారు. కర్కాటక రాశి: ఈరోజు మొత్తం సంతోషకరమైన రోజుగా ఉంటుంది. మీ అత్తమామల తరపు నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. సింహరాశి : ఈ రాశి వారికి ఈరోజు శాంతిని కాపాడే రోజు అవుతుంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఓపికగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులు కొందరు మీ ఇంటికి విందుకు రావచ్చు.

These three zodiac signs should be very careful
These three zodiac signs should be very careful

కన్యా రాశి :ఈరోజున మీకు సాధారణంగానే ఉంటుంది.మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు. కార్యాలయంలో కొన్ని శుభవార్తలు వింటారు. మీరు గతంలో చేసిన ఏదైనా తప్పు ఈ రోజున మీకు గుణపాఠంగా మారుతుంది.

తులారాశి : ఈ రాశి వారికి ఈ రోజున కచ్చితంగా ఫలవంతమైన రోజు కానుంది. ఏదో ఒక పనిని పూర్తి చేయడానికి నిరంతరం మీరు సిద్ధంగా ఉంటారు. కానీ వాటిని పూర్తి చేయలేకపోవడం వల్ల మీ మనసుకు బాధగా ఉంటుంది. విదేశాల్లో నివసిస్తున్న మీ కుటుంబ సభ్యుల గురించి కొంత నిరాశాజనకమైన సమాచారాన్ని వినవచ్చును.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కాస్త భయాందోళనలు ఉంటాయి. మీరు యోగ, వ్యాయామాన్ని అనుసరించడం ద్వారా కొన్ని వ్యాధులను సులభంగా తొలగించుకోగలుగుతారు.

ధనస్సు రాశి : ఈ ధనస్సు రాశి వారికి మీ చుట్టూ ఉండే వాతావరణం శుభప్రదంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన కెరియర్లో ఏదైనా సమస్య ఉంటే, దానికి పరిష్కారం దొరుకుతుంది. జీవిత భాగస్వామి కోసం మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

మకర రాశి: ఈ రాశి వారికి ఈ రోజున మద్యస్థంగా ఉండబోతుంది. ఇంటి నుండి పనిచేసే వ్యక్తులు ఈ రోజున తమ పనిపై దృష్టి పెట్టలేరు. కనుక వారు కొన్ని ఇబ్బందుల్లో పడవచ్చు. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడం గురించి ఆలోచిస్తారు.

కుంభరాశి : ఈ కుంభ రాశి వారికి ప్రతికూల పరిస్థితులు తలెత్తినప్పటికీ, దాని నుంచి మీరు ఈజీగా బయటపడతారు. మీ స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తే.. కొంత జాగ్రత్తగా ఉండాలి. లేనట్లయితే ప్రమాద బారిన పడే అవకాశం ఉంది.

మీన రాశి : ఈ రాశి వారికి మనసులో ఏదో ఒక విషయంలో సందేహాలు ఉంటాయి. దీని కారణంగా మీరు కలత చెందుతారు. విద్యార్థులు పరీక్షల కోసంవిశ్రాంతి తీసుకుంటే, హానికరంగా మారే ఛాన్స్ ఉన్నది.