Devotional : ఈ రోజు ఈ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుందట..!!

మన హిందువుల సాంప్రదాయం ప్రకారం ప్రతి నెలలో ఒక అమావాస్య, పౌర్ణమి రావడం సహజమే.. ఇక ఇదే తంతు లో ఈ పౌర్ణమి అమావాస్యల ను ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది అమావాస్యరోజు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది తమ పితృదేవతలను సమర్పించుకొని వారికి పిండప్రదానాలు వంటివి చేస్తూ ఉంటారు.. ఇక ఇలాంటి అమావాస్య రోజున పితృ దేవతలు తమ ఇంటికి వస్తారని వారికోసం ఎక్కడైనా దేవాలయాల దగ్గర కొంత ఆహారాన్ని నైవేద్యంగా ఉంచి ఆ తరువాత ఆహారాన్ని కాకులకు పెడుతూ ఉంటారు.

ఇక ఈ రోజున అమావాస్య రావడం జరిగింది.. అదికూడా మౌని అమావాస్య అన్నట్లుగా పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ అమావాస్య రోజున కొన్ని పనులను చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడతారని పండితులు తెలియజేస్తున్నారు. మరి ఈ అమావాస్య రోజున ఏటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ రోజున ఉదయాన్నే నిద్ర ఆలస్యంగా లేవడం మంచిది కాదు.. అలా చేస్తే దరిద్ర దేవత లు ఆవహిస్తారని పండితులు తెలియజేస్తున్నారు.ముఖ్యంగా ఈ రోజున కొత్త దుస్తులు ధరించకూడదు.. అదేవిధంగా కత్తెరతో గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటివి అస్సలు చేయకూడదు.

these things today the poor will be haunted
these things today the poor will be haunted

ఈ అమావాస్య ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది అని కొంతమంది పండితులు తెలియజేయడం జరిగింది. అంతవరకు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఎవరు జుట్టుకి నూనె రాయడం, తలదువ్వడం వంటివి అస్సలు చేయకూడదు.. అలా చేస్తే సాక్షాత్తు దరిద్ర దేవత మన ఇంట్లోకి ఆవహిస్తుందట. అంతేకాకుండా ఈ రోజున లక్ష్మీ దేవత ను పూజిస్తే వారికి సకల దరిద్రాలు చుట్టుముడతాయి అని కొంతమంది పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు 4 నుంచి 5 గంటల సమయంలో ఎవరు భోజనం చేయకూడదట. కేవలం పండ్లు, జూస్ వంటి వాటితోనే కడుపు నింపుకోవాలి.. ఇటువంటి ఏ పనులు చేయకుండా ఉంటే మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.