Nandamuri Family చెట్టంత కొడుకు కళ్ళముందే మరణిస్తే ఆ తండ్రికి అంతకంటే దారుణమైన దుస్థితి మరొకటి ఉండదు. దురదృష్టవశాత్తు తెలుగు ఇండస్ట్రీలో కొందరు సినీ ప్రముఖులకు ఈ దారుణమైన పరిస్థితి కల్పించాడు ఆ భగవంతుడు తాజాగా ఎన్టీఆర్ ఐదవ కుమారుడు నందమూరి మోహనకృష్ణ కుమారుడు తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. అలా ఇప్పటివరకు నందమూరి కుటుంబంలో.. కళ్ళముందే తమ కొడుకులను కోల్పోయిన తండ్రులను చూస్తే నిజంగా బాధాకరం. మరి వారెవరు ఇప్పుడు చూద్దాం.
సీనియర్ ఎన్టీఆర్ – రామకృష్ణ:
సీనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన పెద్ద కొడుకు రామకృష్ణకు చిన్నవయసులోనే అరుదైన వ్యాధి రావడంతో అనారోగ్యంతో మరణించారు. రామకృష్ణ మరణించినప్పుడు ఇరుగు పొరుగు సినిమా షూటింగ్లో ఉన్నారు ఎన్టీఆర్. అయినా కూడా అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని కొడుకును కడసారిగా చూసుకొని కుమిలిపోయారు.

హరికృష్ణ – జానకిరామ్:
నందమూరి కుటుంబంలోని హరికృష్ణ కి కూడా పుత్ర శోకం తప్పలేదు. ఆయన పెద్ద కుమారుడు జానకి రామ్ కూడా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. విచిత్రం ఏమిటంటే కొడుకు చనిపోయిన నాలుగేళ్లకు తండ్రి హరికృష్ణ కూడా అదే ఆక్సిడెంట్ లో మరణించారు.

నందమూరి త్రివిక్రమ్ రావు – హరేన్ చక్రవర్తి :
ఎన్టీఆర్ తమ్ముడైన త్రివిక్రమ్ రావు చిన్న కుమారుడు నటుడైన హరేన్ చక్రవర్తి ఇంట్లో అగ్ని ప్రమాదం కారణంగా అకాల మరణం పొందారు.. ఇలా అన్నదమ్ములు ఇద్దరికీ కూడా పుత్రశోకం మిగిలింది.
నందమూరి కళ్యాణ్ చక్రవర్తి – పృథ్వి చక్రవర్తి:
ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ్ రావు పెద్ద కుమారుడైన కళ్యాణ్ చక్రవర్తి కుమారుడు పృథ్వి చక్రవర్తి కూడా ఒక రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం విషాదకరం.
నందమూరి మోహనకృష్ణ – తారకరత్న :
ఎన్టీఆర్ కొడుకు నందమూరి మోహన్ కృష్ణ.. ఆయన ఏకైక వారసుడు తారకరత్న కూడా నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు.