Devotional : ఇంట్లో ధూపం వేయడం వెనుక ఇంత రహస్యం దాగి ఉందా..?

Devotional : ముఖ్యంగా హిందువులకు సామ్రాణి దీపం గురించి బాగా తెలుసు అని చెప్పవచ్చు. కేవలం పూజగదిలో మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో కూడా ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఇంట్లో ధూపం వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. గతంలో దేవునికి మాత్రమే ధూపం వేసేవారు కానీ అలవాటు ప్రకారం తర్వాత కాలంలో ఎన్నో రకాలుగా ధూపాన్ని ఉపయోగిస్తూ వస్తున్నారు. దేవుడికి సాంబ్రాణి వేయడం లో ఉన్న ఆంతర్యం ఏమిటో ఆచారాన్ని ఎందుకు పెట్టారు అని విషయం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

పూర్వకాలంలో సాంబ్రాణిని శుద్ధ చందనంతో కలిపి ఆవు పిడకలను, గుగ్గిలం లో వేసి వెలిగించే వాళ్ళు. దీని వల్ల సూక్ష్మక్రిములు, దోమలు వంటివి నిర్మూలించబడతాయి. ముఖ్యంగా పొగను పీల్చడం వల్ల ఎటువంటి రోగాలు దరిచేరవు. ముఖ్యంగా ఇంట్లో ఉండే క్రిములు కీటకాలు అన్ని దూరం అవుతాయి ఇకపోతే ఒకప్పుడు బొగ్గులతో వెలిగించేవారు. కానీ మార్కెట్లో ప్రస్తుతం ధూప్ స్టిక్ అందుబాటులో ఉన్నాయి వీటిని వెలిగిస్తే చాలు ఇంటి మొత్తం పొగ వ్యాపించడంతో పాటు ఇంట్లో ఉండే క్రిములు కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇక దీపం వెలిగించడం వల్ల ఇంట్లో క్రిమి కీటకాలు దూరం అవుతాయి. ముఖ్యంగా ధూపం వేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

These Are Benefits Of Dhoop During Puja That Brings Happiness
These Are Benefits Of Dhoop During Puja That Brings Happiness

ఇక ముఖ్యంగా బాలింతలకు, శిశువులకు సాంబ్రాణి ధూపం వేయడం అనాదిగా వస్తున్న ఆచారం.. ఇలా చేయడం వల్ల రుగ్మతలు తొలగిపోతాయి. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. ఇక పసి పిల్లలకు స్నానం చేసిన తర్వాత ధూపం వేయడం వల్ల ఆకలితో ఉన్న వారు హాయిగా నిద్ర పోయేలా చేస్తుంది . చిన్న పిల్లలకు జలుబు , దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి. మానసిక సమస్యలతోపాటు కీళ్ల నొప్పులు, జీర్ణక్రియ సంబంధిత సమస్యలు , చర్మ రోగాలు, ఆస్తమా , అల్సర్ , క్యాన్సర్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవు అని చెబుతూ ఉంటారు. నెగటివ్ ఎనర్జీ దూరం కావడమే కాకుండా సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి.