శ్రావణమాసం మొదలైన రెండో రోజే మొదటి శ్రావణ శుక్రవారం రావటం విశేషం. ఆగస్టు 17వ తారీకు నుంచి శ్రావణమాసం మొదలైంది. ఈ శ్రావణమాసం సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది. ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ద్వారా ఎన్నో పుణ్యాలు సంపాదించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే.. శ్రావణ మాసంలో అన్ని శుక్రవారలు పూజలు చేయాలంట. మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో ఆడవాళ్లు ఉదయాన్నే లేచి తలసనానం చేసి ముగ్గులు వేసి అలంకరించుకోవాలట. అమ్మవారు మాదిరిగా తమని తాము బొట్టు గాజులు పసుపు పెట్టుకుని అలంకరించుకుని..
ఎప్పుడు వేసుకునే బట్టలు కాకుండా కాస్త ప్రత్యేకంగా ఉండాలని. ఇక మొదటి శుక్రవారం నాడు చేసే పూజలో అమ్మవారి విగ్రహం దగ్గర పసుపు కుంకుమ గిన్నెలు పెట్టాలట. కొత్త వస్తువులు ఏవి తీసుకున్న పూజ గదిలో పెట్టుకోవచ్చు. కామాక్షి దీపం ఉన్న వెలిగించాలట. ఈ దీపాన్ని ప్లేట్లో బియ్యం ఇంకా తమలపాకు పై పెట్టి అలంకరించాలంటే. ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ప్రమిదలో నెయ్యి వేసి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళ ఈ దీపం పెడితే మంచి జరుగుతుందట. ఇక మొదటి శ్రావణి శుక్రవారం రోజు బీఎండబ్బాలో పసుపు రంగు గుడ్డ తీసుకుని.. రూపాయి నానాలను ఐదు తీసుకుని పసుపు గుడ్లు పెట్టి బియ్యం డ్రంలో పెట్టాలట. ఈ రకంగా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం పొందుకొని నాలుగు వైపుల నుండి డబ్బులు వచ్చేలా లాభాలు అందుకోవచ్చనీ పండితులు చెప్పుకొస్తున్నారు.