Sravana Masam : మన తెలుగు నెలల్లో శ్రావణమాసం, కార్తీకమాసం అంటే ఆ మహా శివునికి చాలా ప్రీతికరమైన మాసాలు..ఆ మాసాల్లో అన్ని రోజులు శుభప్రదమైనవే,కానీ కొన్ని చాలా ప్రత్యేక మైన రోజులు కూడా వున్నాయి . ఆ ప్రత్యేకమైన రోజుల్లో శివునికి ప్రత్యేక పూజలు చేస్తే సకల భాధలు తొలగిపోతాయని పండితులు సూచిస్తుంటారు.ఈ మాసాలలో శివుడికి మాత్రమే కాదు మరో ఐదుగురు దేవుళ్ళకు కూడా పూజలు చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఆ దేవుళ్ళు ఎవరు, వారికి ఎలాంటి పూజలు చేయాలో ఇప్పుడు చూద్దాం.. మంగళవారంకు అధిపతి ఆంజనేయ స్వామిగా చెబుతారు. అందుకే శ్రావణ మాసంలో మంగళవారం నాడు ఆంజనేయుడుకి పూజించడం వల్ల ఏ బాధలు వుండవని.. వచ్చినా భరించగలిగే శక్తి వస్తుంది అని పండితులు చెబుతారు.ఎందుకంటే ఆంజనేయుడు ఒక రుద్రావతారి.
అంటే, శ్రీ ఆంజనేయుడు శివుని రుద్ర అవతారాలలో ఒకటి. హనుమంతుడిని పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి.. శ్రావణ మాసంలో కృష్ణ పంచమి నాడు నాగ దేవతను పూజిస్తే నాగదోషాలు పోయి ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు . శుక్ల పంచమి నాడు నాగ పంచమి ఉపవాసం దీక్ష పాటించి, అష్టనగర పూజతో పాటు మానస దేవి, ఆస్తిక ముని, మాత కద్రు, మాత సురస పూజలు చేయడం వల్ల సర్వ దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయని నమ్ముతారు. శ్రావణ మాసం కృష్ణ పక్ష అష్టమి నుండి భాద్రపద కృష్ణ పక్ష అష్టమి వరకు శ్రీకృష్ణుడిని పూజించే సంప్రదాయం ఉంది. భాదౌ అష్టమి రోజున శ్రీ కృష్ణజన్మాష్టమి పండుగను జరుపుకుంటారు . ఈ మాసమంతా శ్రీకృష్ణుడిని పూజిస్తే శక్తి, యుక్తి లభిస్తాయని నమ్ముతారు.శ్రీకృష్ణునితో పాటు తల్లి యశోద, విష్ణువు, లక్ష్మీ దేవిని కూడా పూజిస్తే సంతాన సౌపల్యం కలుగుతుంది.
మరియు సంతాన దోషాలు తోలుగుతాయి. శ్రావణ మాసంలోని షష్ఠి తిథి నాడు కార్తికేయ పూజించుటకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ మాసంలో కార్తికేయున్ని పూజించడంవల్ల పుణ్యం, ఆయురారోగ్యాలు, కీర్తి లభిస్తాయని నమ్మకం. అలాగే సంకట చతుర్థి నాడు వినాయకుడిని పూజించి ఉపవాసం చేయడం వల్ల మన జీవితంలో కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయని భావిస్తారు. శ్రావణమాసంలో మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు.మంగళ గౌరి అంటే మహాగౌరీ పార్వతి స్వరూపం. శ్రావణ మాసంలో పార్వతి దేవిని పూజించడం ద్వారా వైవాహిక జీవితంలో ఉన్న చికాకులాన్ని తొలగి సంసారం సజావుగా సాగుతుంది.శ్రావణమాసంలో ఈ దేవుళ్లను ఆరాధిస్తే ఆర్థికసమస్యలు తొలగి, లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఏర్పరచుకుంటుందని పండితులు సూచిస్తారు.