Rasi Phalalu : షష్టగ్రహ కూటమి గురించి ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

Rasi Phalalu : ఆరు గ్రహాలు ఒకే రాశిలో కలవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. 2019లో డిసెంబర్స్ 26 నుంచి 28 వరకు సస్తాగ్రహ కూటమి వచ్చాకే కరోనా ప్రబలిందని వార్తలు కూడా వచ్చాయి. దీనికి జ్యోతిష్యపరమైన విశ్లేషణను కొందరు జ్యోతిష్య పండితులు కూడా అందించారు. మరోసారి ఇలాంటి గ్రహ కలయిక జరిగింది. 2020 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రహ కూటమి ఏర్పడింది.

2019లో షష్ఠగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కాలసర్ప దోషం ఉంది. అంటే అన్ని గ్రహాలు రాహు,వు కేతువు మధ్య బందీ అవ్వడం. ఇలాంటి గ్రహ కూటములు ఏర్పడడం అరుదైన విషయమే. ఆరు గ్రహాలు మాత్రమే కాదు మనకున్న నవగ్రహాల లో 8 గ్రహాలు ఒకే రాశిలో కలిసిన సందర్భాలు ఉన్నాయి. 1962లో ఇలాంటి అష్టగ్రాహ కూటమి ఏర్పడింది. అప్పుడు ఎలాంటి ఉపద్రవాలు తలెత్తలేదు.

గత ఏడాది డిసెంబర్ లో ధనస్సు రాశిలో శని , కేతువు, గురువు, చంద్ర , రవి, బుధ గ్రహాలు కలిసాయి. కచ్చితంగా అదే సమయంలో వైరస్ ప్రాబ్లమ్ మొదలైంది. ఫిబ్రవరిలో మకర రాశిలో రవి, బుధ, గురు, శుక్ర , శని, చంద్రులు కలుస్తున్నారు. కాకపోతే అప్పుడు ఆయా గ్రహాలతో కేతు కలిసి ఉన్నాడు. ఈసారి రాహు కేతువులు ఈ ఆరు గ్రహాలకు దూరంగా ఉన్నాయి . ఈసారి వచ్చే షష్ట గ్రహ కూటమికి భయపడాల్సిన పని ఏమీ లేదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈసారి వ్యాక్సిన్ ఈ గ్రహ కూటమి తెచ్చింది అనుకొని పాజిటివ్ థింకింగ్ తో ఉండటం మంచిదని తెలిపారు.